Vasthu: మీకు నరదిష్టి తగిలిందా.. ఆ చిట్కాతో సులువుగా చెక్ పెట్టొచ్చట!

Vasthu: మన హిందూ సంస్కృతిలో శాస్త్రాలు, ఆచారాలు, సాంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీంతో ఇప్పటికి ప్రజలు వాటిని గౌరవిస్తూ పాటిస్తున్నారు. అలాగే మ‌న పెద్ద‌లు, మ‌నం నమ్ముతూ వ‌స్తున్న ఆచారాల్లో దిష్టి కూడా ఒక‌టి. పూర్వం మన పెద్దలు న‌రుడి దిష్టికి నాప‌రాళ్లు కూడా ప‌గులుతాయనే సామెత‌ను చెప్పేవారు. అంటే న‌రుడి చూపుకి పెద్ద రాయి కూడా ప‌గులుతుంద‌ని అర్థం. అంటే మానవుని చూపు అంత పవర్ ఉంటుందని అర్థం.

ఇప్పటికీ ప్రజలు దిష్టి ఉందని నమ్ముతున్నారు. అయితే నరదృష్టి మనపై పడకుండా ఉండటానికి ఎలాంటి చిట్కాలు పాలించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా ఇళ్లు,దుకాణాల మీద నరదృష్టి పడకుండా ఉండటానికి ఇంటి ముందు దిష్టిబొమ్మ, గుమ్మడికాయ వేలాడదీస్తూ ఉంటారు. ఇవి ఇంటిపై నరదృష్టి పడకుండా అడ్డుకుంటాయని ప్రజల నమ్మకం. అలాగే నిమ్మకాయలు ఎండుమిర్చి కూడా నరదృష్టిని నివారిస్తాయని నమ్మకం.

 

ఎంతోమంది ఇంటి ముందు, దుకాణాల ముందు నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు వేలాడదీస్తూ ఉంటారు. అలాగే మానవులకు కూడా దిష్టి తగలకుండా ఉండటానికి నల్ల దారం, తాయత్తులు కట్టుకుంటారు. ఒక వేళ మనుషులకు దిష్టి తగిలినా కూడా వివిధ రకాలుగా దిష్టి తీస్తారు. ఇవన్నీ కాకుండా న‌ర దిష్టి నుంచి త‌ప్పించుకునేందుకు మరొక సుల‌భ‌మైన మార్గం కూడా ఉంది. అదే గ‌ణ‌ప‌తి గాయ‌త్రి మంత్రం.

 

ఈ మంత్రాన్ని రోజులో ఒకేసారి 108 సార్లు జ‌పించాలి. ఇలా ఆపకుండా 108 సార్లు గణపతి గాయత్రి మంతం జపించడం వల్ల దిష్టి ప్ర‌భావం నుంచి సుల‌భంగా త‌ప్పించుకోవ‌చ్చు. అందువల్ల ఎవరికైన దిష్టి తగిలిన సూచనలు కనిపిస్తే వెంటనే… ఓం తత్పురుషాయ విఘ్నహే..!!, వ‌క్రతుండాయ ధీమహి..!!, తన్నోన్ గణపతి ప్రచోదయాత్..!! అనే మంత్రాన్ని 108 సార్లు ఆపకుండా జపించడం వల్ల నరదృష్టి నుండి విముక్తి లభించి సమస్యలు అన్నీ తొలగిపోతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -