Vastu: మంగళవారం ఈ తప్పులు చేస్తే మాత్రం భారీగా నష్టపోతారట..ఏమైందంటే?

Vastu: సాధారణంగా మనం ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా లేదా ఒక శుభకార్యం చేయాలన్న సరైన వారం తిథి గడియలు చూసుకుని ఆ పని మొదలు పెడతాము. అలాగే ఒక్కో రోజు కొన్ని పనులు చేయడం మంచిది కాదని కూడా కొందరు భావిస్తూ ఉంటారు. ఇలా మంగళవారం రోజు ఏదైనా శుభకార్యాలు మంచి పనులు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపించరు. మంగళవారం కొన్ని పనులు చేయడానికి శుభసూచకం అని కూడా చెబుతారు. కొన్ని తప్పులను చేస్తే మాత్రం భారీగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందట.మరి మంగళవారం ఎలాంటి పనులు చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే…

నవగ్రహాలలో ఒకరైన కుజుడు మంగళవారానికి అధిపతి.ఈయన రౌద్రుడు అని కూడా అంటారు అందుకే మంగళవారం ఒక పదిమంది కలిసి చేసే పనులను ఎప్పుడు కూడా చేయకూడదు.ఇలా పదిమంది కలిసి పనులు చేస్తే కుజుడు కోపానికి గురవుతారు దాంతో గొడవలు పోట్లాటలు తప్పకుండా జరుగుతాయి. అందుకే మంగళవారం ఇలాంటి కష్టమైన పని అయినా గుంపులుగా కాకుండా ఒకరే చేసుకోవడం మంచిది.

 

ఇక మంగళవారం ఎట్టి పరిస్థితులలోను ఇతరుల వద్ద అప్పు చేయకూడదు.మంగళవారం అప్పు తీర్చడానికి ఎంతో అనువైన సమయం మనం ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకొని ఉంటే వారికి మంగళవారం తిరిగి ఇవ్వటం వల్ల తిరిగి మనం అప్పు చేసే పరిస్థితులు ఏర్పడదని పండితులు చెబుతుంటారు. ఇక ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకునే వారు మంగళవారం చేయించుకోవడం ఎంతో మంచిది.

 

ఇక మంగళవారం ఎట్టి పరిస్థితులలోను జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. అలాగే వాహనాలను ఎట్టి పరిస్థితులలో కొనుగోలు చేయకూడదు. మంగళవారం ఇల్లు వాహనాలు భూమి రిజిస్ట్రేషన్ వంటి పనులు అసలు చేయకూడదు. మంగళవారం నాడు క్రీడలకు సంబంధించిన కోచింగ్‌లో చేరడం కూడా మంచిది. ఇక రైతులు అయితే మంగళవారం మిరప, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, పొగాకు వంటి వాటికి సంబంధించిన పనులు చేసుకోవడానికి ఎంతో అనుకూలమని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో...
- Advertisement -
- Advertisement -