Naraghosha: ఈ లక్షణాలు కనిపిస్తే నరఘోష ఉన్నట్టే.. అస్సలు చెయ్యకూడని తప్పులివే!

Naraghosha: నరఘోషకి మూలం అసూయ. పక్కవాడు బాగున్నాడు అంటే చుట్టూ ఉన్న పదిమందిలో కనీసం 8 మంది అసూయతో రగిలిపోయే వారే.ఆ 8 మందిలో మన సన్నిహితులు కూడా ఉండవచ్చు కానీ మనం గుర్తించలేము. అయితే మన గురించి వాళ్ళ అసూయ కరమైన మాటలు కూడా నరఘోషకి, నరదృష్టి కి కారణం అవుతాయి.

అలాగే దిష్టి తీసిన నిమ్మకాయలని తొక్కటం వంటివి కూడా మనకి దోషాన్ని కలిగిస్తాయి.మనకి నరఘోష తగిలింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి అకారణంగా ఒంటినొప్పులు రావడం మనసు ఉన్నట్టుండి అచంచలం అయిపోవడం, సమయం లేకుండా ఆవలింతలు రావడం, తలనొప్పి, కళ్ళు మంటలు ఉంటాయి.

 

ఈ లక్షణాలు ఉంటే మనకి నరదృష్టి ఉన్నట్టే. ఈయన దృష్టి వలన పడే యాతన అంతా ఇంతా కాదు. ఒక్కొక్కసారి అనారోగ్యం పాలై మంచం కూడా పట్టేస్తాం. అయితే ఈ నరదృష్టి నుంచి తప్పించుకోవటానికి మార్గాలు లేవా అంటే ఉన్నాయని చెప్తున్నాయి పురాణాలు అలాగే పండితులు కూడా వాటికి నివారణ మార్గాలు చెప్తున్నారు.

 

ముందుగా దిష్టి పోవాలంటే మనం చేయవలసిన పని బూడిద గుమ్మడికాయతో కానీ మామూలు గుమ్మడితో కానీ ఉప్పుతో కానీ మూడుసార్లు దిష్టి తీసి వేస్తే దోషం పోతుంది. ఇంకా దిష్టి తీవ్రత ఎక్కువగా ఉంది అనిపిస్తే ఆయుధంగా కలిగిన అమ్మవారు ధూమావతి.

 

ఈ అమ్మవారికి ఉప్పు నైవేద్యంగా పెట్టడం, ఉప్పుతో హోమం చేయడం వంటివి చేయటం వలన దోష నివారణ పూర్తిగా కలుగుతుంది ఈమె మన నరదృష్టి నరగోషలను చేటతో చెరిగి వేస్తుందని ప్రతీతి. అలాగే మనకి నిద్రపోయేటప్పుడు నిద్ర సరిగ్గా పట్టకపోవడం మనం కప్పుకునే..

 

దుప్పటి కూడా మనం తీసుకోలేనంత నిస్సహాయతకి వెళ్లిపోయినప్పుడు ఈ అమ్మవారికి హోమం చేస్తే దోష నివారణ పూర్తిగా కలుగుతుంది. అలాగే ఓం ధూమ్ ధూమావతే స్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ ఉప్పుని దిష్టి తీసుకున్నట్లయితే దోష నివారణ జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Ys Jagan- Ys Bharathi: భారతికి జగన్ విడాకులు ఇస్తారా.. వైరల్ అవుతున్న బాబు సంచలన వ్యాఖ్యలు!

Ys Jagan- Ys Bharathi: ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా క్లాస్ గా మాట్లాడేవారు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో అయినా లేదంటే ఏదైనా సభలు సమావేశాలలో అయినా కూడా...
- Advertisement -
- Advertisement -