Mahesh: కుర్చీ పాటతో మహేష్ మూవీకి సొంతమైన ఈ రికార్డ్ గురించి తెలుసా?

Mahesh: గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ సోషల్ మీడియా ఫ్లాట్ఫారం అయిన ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ రీల్స్ తో సరికొత్త చరిత్ర సృష్టించింది. తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపుతుంది అనటానికి ఈ పాటకు వచ్చిన రికార్డ్ ఉదాహరణ. ఈ పాటకి మహేష్ బాబు, శ్రీ లీల చేసిన డాన్స్ అయితే మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా థియేటర్లో డాన్సులు చేసేలాగా చేసింది.

 

అసలు ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు థియేటర్లో తిన్నగా కుర్చీల్లో కూర్చున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మహేష్ 20 ఏళ్ల వెనక్కి వెళ్లి మరీ స్టెప్స్ వేశాడు. ఇక డాన్స్ విషయంలో శ్రీ లీల సంగతి వేరే చెప్పనే అక్కర్లేదు. హీరోల తాట ఊడిపోతుంది అని స్టేజ్ మీద మహేష్ బాబు చేతే అనిపించుకున్న మంచి డాన్సర్ శ్రీ లీల.

డాన్స్ రాని వాళ్ళకి సైతం ఈ పాటలో హీరో హీరోయిన్ వేసిన డాన్స్ చూస్తే డాన్స్ వెయ్యాలనిపించేలా చేశారు ఇద్దరూ. ఈ సాంగ్ లో డాన్స్ స్టెప్స్ నచ్చిన యూత్ ఎందరో ఈ సాంగ్ కి రీల్స్ చేశారు. సెలబ్రెటీల్ నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ రీల్స్ చేసినవారే.ఇప్పట్లో ప్రేక్షకులలో ఈ మానియా తగ్గేటట్లు కనిపించడం లేదు.

 

అందుకే వన్ మిలియన్ కి చేరుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ పాట. నిజానికి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది అయినప్పటికీ కలెక్షన్ల పరంగా 200 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని అత్యధిక కలెక్షన్లు అందుకున్న రీజనల్ సినిమా గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు పై మహేష్ బాబు ఫ్యాన్స్ మీసాలు మెలేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -