WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్.. ఇకపై అలాంటి తప్పులు చేస్తే జైలుకే?

WhatsApp: ప్రతిత రోజుల్లో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది వాట్సాప్ లో వినియోగిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో వాట్సాప్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు చాలామంది వాట్సాప్ లోనే గడుపుతున్నారు. వినియోగదారుల కోసం వాట్సాప్ సంస్థ ఇప్పటికీ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ లో ఎప్పటికప్పుడు తప్పులు చేస్తున్న వారి అకౌంటు లను కూడా బ్యాన్ చేస్తూ వస్తోంది. వాట్సాప్‌ లో అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు షేర్‌ చేస్తున్నవారికి గుర్తించి వారి వాట్సాప్‌ అకౌంట్‌ను బ్యాన్‌ చేస్తోంది కంపెనీ.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా పరిచయమైన వాట్సప్ ఆ తర్వాత ఎన్నో ఫీచర్స్‌తో యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. రోజురోజుకు కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే వాట్సాప్‌లో పోర్న్‌ క్లిప్స్‌ షేర్‌ చేయడం పెద్ద తప్పు. ఇది మిమ్మల్ని జైలు వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ఈ విషయంలో వాట్సాప్‌ కఠిన నిబంధనలను రూపొందించింది. మీ ఖాతా బ్యాన్ చేసి, మీపై పోలీస్ ఫిర్యాదు కూడా ఇవ్వవచ్చు. ఇతరుల పేరు మీద వాట్సాప్‌ ఖాతా ఓపెన్ చేస్తే మీరు చిక్కుల్లో పడినట్లే. మీరు వాట్సాప్‌లో వచ్చిన సమాచారాన్ని నిజమా కాదా అన్నది తెలుసుకోకుండా షేర్‌ చేసినట్లయితే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ వల్ల చిక్కుల్లో పడ్డ ఎన్నో ఘటనలు జరిగాయి. అందుకే నకిలీ వార్తలను షేర్‌ చేయవద్దు. కులమతాలు, వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు కూడా చేయవద్దు. అలాగే ఎవరు పడితే వారు మిమ్మల్ని వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి అయితే అలా గ్రూపుల్లో యాడ్‌ చేస్తున్నట్లయితే ప్రైవసీ సెట్టింగ్స్‌లో మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్ చేయాలో పర్మిషన్ ఇవ్వొచ్చు. మీకు అవసరం లేని మెసేజెస్ సేవ్ చేయకండి. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌తో మీ వాట్సప్ మెసేజెస్ ఎప్పటికప్పుడు డిలిట్ అయ్యేలా సెట్టింగ్స్ చేయవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -