Lord Hanuman: హనుమంతుడిని ఎందుకు పూజించాలో తెలుసా.. ఆంజనేయని గొప్పతనం తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే

Lord Hanuman:  భారతదేశంలో హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. కొందరు హనుమంతుడిని మంగళవారం పూజిస్తే మరి కొంతమంది శనివారం పూజిస్తూ ఉంటారు. ఆయనకు సింధూరాన్ని సమర్పించి తమలపాకులతో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తాడని కావలసినంత ధైర్యాన్ని అందిస్తాడని నమ్ముతూ ఉంటారు. అయితే రామాయణంలో సుందరకాండ లో స్వామి హనుమ మాట్లాడే తీరు పరిశీలిస్తే పరమాద్భుతంగా ఉంటుంది. రామ కథే మత సంజీవిని. ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంత వరకే మాట్లాడుతాడు తప్ప సాగ తీసి మాట్లాడలేదు. స్వామి హనుమాన్ ఉపాసన చేస్తే ఎలా మాట్లాడాలి.

ఎలా నడుచుకోవాలి, మంత్రులతో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అలాగే ఇతరుల హృదయాల్లో ఎలా చోటు సంపాదించుకోవాలో కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడలేదు. సాగదీసి మాట్లాడలేదు. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే సముద్ర లంకనం చేసి వెళ్ళిపోతున్నాడు హనుమాన్. సముద్రుడు తనలో ఉన్నటువంటి బంగారు శిఖరములని కలిగి ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని ఉద్దేశించి నువ్వు పైకి కిందకి పక్కలకి కూడా పెరగగలవు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడికి సహాయం చేయడానికి హనుమంతుడు వెళ్తున్నాడు. తిరిగి నువ్వు ఉపకారం చేయాలి. శిఖరాల‌ మీద పండ్లు ఉన్నాయి. తేనెపట్లు ఉన్నాయి. కాబట్టి హనుమకి స్వాగతం ఇచ్చి.

ఆతిథ్యం ఇవ్వు అని అన్నాడు. వెంటనే మైనాక పర్వతం సముద్రంలో నుండి పైకి లేచింది. మైనాకుడు మనిషి శరీరాన్ని ధరించి నిలబడతాడు. స్వామి హనుమాన్ ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఎవరైనా మనకి ఉపకారం చేస్తే వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు. నీ తండ్రి వాయువు నాకు ఒకసారి ఉపకారం చేశాడు. కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. గాలిలో ఎగిరి వెళ్తుంటే మరణిస్తాయని ఋషి సంఘములు, భూత సంఘములు భయపడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధం ధరించి రెక్కలు తెంపేశాడు. మీ తండ్రి స్నేహితుడు కనుక నన్ను పైకెత్తి తీసుకువచ్చి సముద్రంలో పెట్టాడు.

అప్పుడు నేను సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళంలో రాక్షసులు పైకి వచ్చేటువంటి మార్గానికి మూతలాగా అడ్డంగా పడ్డాను. మీ తండ్రి ఒకప్పుడు నాకు ఉపకారం చేశారు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యాలి. సామాన్యమైన అతిథి వస్తేనే పొంగిపోతాము. అటువంటిది మీలాంటి అతిథి వస్తే ఎలా ఊరుకుంటాము. నా శిఖరములు మీద వాలి కూర్చో. కాస్త తేనె తాగు, పండ్లు తీసుకో. ఆ తర్వాత బయలుదేరండి అంటాడు. ఇది హనుమంతుడు వెనుక ఉన్న అసలు కథ.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -