Hanuman: మీ జీవితాన్ని మార్చే మంత్రం ఇదే.. హనుమంతుని అనుగ్రహం వస్తుందట!

Hanuman: జీవితంలో అనుకున్నది సాధించటం కోసం మంచి భవిష్యత్తు కోసం మంచి ఉద్యోగం కోసం మానవుడు తనవంతు ప్రయత్నం తాను చేస్తాడు అది కుదరనప్పుడు భగవంతుని మీద భారం వేస్తాడు. భగవంతుడు కూడా ప్రతి విషయంలో తన వంతు సాయం చేస్తూనే ఉంటాడు.

కాకపోతే అక్కడ కావలసింది మన భక్తి, మన శ్రద్ధ. ఇక ఇప్పుడు ఉద్యోగం కోసం, లేదంటే ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు ప్రతిరోజు ఆంజనేయస్వామి మంత్రాన్ని ప్రార్థించడం ద్వారా ఖచ్చితంగా విజయాన్ని పొందవచ్చు.

 

“తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ! హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖః క్షయకరో భవ!” అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద! “రామదూత కృపాం సింధో మమకార్యం సాధయ ప్రభో ” ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపిస్తే మీకు ఉద్యోగం వస్తుంది.

 

కాకపోతే మీరు కొన్ని నియమాలని పాటించవలసి ఉంటుంది సూర్యోదయానికి ముందే లేచి స్నానపానాదులు ముగించి శుభ్రమైన బట్టలు, వీలైతే తెల్ల బట్టలు ధరించి అయితే సీతారాములు పటానికి లేకపోతే ఆంజనేయ స్వామి పటానికి పూజ ప్రారంభించాలి.

 

గంగ సింధూరాన్ని తీసుకొని ఆవు నేటితో తడిచేసుకుని తిలకం లాగా పెట్టుకోవాలి దానిమీద కొంచెం కుంకుమ కూడా పెట్టుకోవాలి. దీపం వెలిగించి తమలపాకులు బెల్లాన్ని అరటిపండు గాని ఒక 5 ఖర్జూర పండ్లను కానీ పెట్టి నైవేద్యం పెట్టండి.

 

ఇక్కడ నైవేద్యాల కన్నా భక్తిశ్రద్ధలు ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇంట్లో ఈ పూజ చేయటానికి కుదరని వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్లి ఈ పూజని చేసుకోవచ్చు. ఆలయానికి వెళ్లిన తరువాత అక్కడ 5 అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి తర్వాత ఐదు ప్రదక్షిణాలు కూడా చేయండి.

 

తర్వాత ఒక శుభ్రమైన చోట కూర్చొని పైన చెప్పిన ఆంజనేయస్వామి మంత్రాన్ని జపించడం వలన మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రయత్నించి చూడండి మంచి ఫలితాలని పొందండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -