Devotional: ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో అస్సలు చెయ్యకూడని తప్పులివే!

Devotional: భారతదేశంలోని హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో ఆంజనేయస్వామి కూడా ఒకరు. కొంతమందికి ఆంజనేయస్వామి మంగళవారం పూజిస్తే మరి కొంతమంది శనివారం రోజు పూజిస్తూ ఉంటారు.. ఈ రెండు రోజుల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆంజనేయస్వామికీ ఇష్టమైన వాటిని సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కష్టాల నుంచి గట్టెక్కించడంతోపాటు ధైర్యాన్ని కూడా ఇస్తారు. మరి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే స్వామివారిని ఏ విధంగా పూజించాలి. పూజ చేసే సమయంలో ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని కొలిచేటప్పుడు ఇలా చేస్తే, ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. సమస్యల నుండి గట్టెక్కి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి అవుతుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ అంటే ఎంతో ఇష్టం. ఆయన‌కి నిమ్మ, కొబ్బరి, పనస అంటే చాలా ఇష్టం. అరటి, మామిడి, నేరేడు కూడా ఇష్టమే. పూజ చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి ఇష్టమైన పారిజాతములు, మందార పుష్పములు, నందివర్ధనము పూలతో పూజ చేయడం మంచిది. అలానే మల్లెలు, గన్నేరు వంటి పూలంటే కూడా ఆయనకి మహా ఇష్టం. తులసీ, మారేడు, మామిడి, మాచీపత్రము, ఉత్తరేణి పత్రముల‌తో కూడా పూజ చేయండి. ఇవి కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం.

 

నైవేద్యంగా పాలు, పాయసం, పొంగలి, అప్పములు, వడలు, వడపప్పు, పానకము సమర్పించి ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు ఇట్టే నెరవేరుస్తాడు. సింధూరము, సింధూరాక్షతలు, పసుపు అక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, ఖ‌ర్జూరము వంటివి కూడా మహా ఇష్టము. ఆంజనేయ స్వామికి దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. అరటి తోటలంటే కూడా ఆయనకి ఎంతో ఇష్టము. కనుక అక్కడ కూడా పూజించవచ్చు. మంగళవారం, శనివారం స్వామిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -