Hanuman: హనుమంతుని తోకకు గంట కట్టడం వెనుక ఏకంగా ఇంత కథ ఉందా?

Hanuman: హిందువులు ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పూజించే వారిలో హనుమంతుడు కూడా ఒకరు అయితే హనుమంతుడి చిత్రపటాలు మనకు వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంటాయి అయితే కొన్ని చోట్ల హనుమంతుడి తోకకు గంట ఉండడం మనం చూస్తుంటాము.ఇలా ఇంట్లో హనుమంతుడి తోకకు గంట ఉన్నటువంటి చిత్రపటం కనుక ఉంటే ఆ ఇంట్లో వారు క్షేమంగా ఉంటారని అలాగే వారిపై హనుమంతుడి అనుగ్రహం రెండింతలు ఉంటుందని భావిస్తారు. మరి ఇలా హనుమంతుడి తోకకు గంట ఉండడం వెనుక కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

రావణాసురుడు సీతను అపహరించిన తర్వాత సీతమ్మ జాడ కనుకున్న అనంతరం లంకపై యుద్ధానికి వెళ్తారు. ఇలా సీతమ్మను తీసుకురావడం కోసం ఎంతోమంది వానర సైన్యం కదిలి వెళుతుంది. ఈ క్రమంలోనే ఈ యుద్ధంలో పాల్గొనడం కోసం సింగిలీకులు అని పిలవబడే పొట్టి మరుగుజ్జు కోతులు కూడా వచ్చాయి.ఇవి కేవలం ఒక అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వీరంతా యుద్ధం కోసం వెళ్తున్న సమయంలో వారి కుటుంబీకులు ఎంతో బాధపడుతూ ఉంటారు అది చూసి చలించిపోయిన రాముడు ఇప్పుడు ఎంతమంది యుద్ధానికి వెళ్తున్నారు వారంతా క్షేమంగా తిరిగి వస్తారని మాట ఇచ్చారు.

 

ఇలా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కుంభకర్ణుడు వస్తున్నటువంటి రథం పై భాగంలో ఉన్న గొడుగుకి ఒక గంట కింద పడటం వల్ల ఆ గంట క్రింద
సింగిలీకులు వెయ్యి మంది ఉండిపోతారు అయితే వారిని కాపాడటానికి ఎవరూ రాకపోవడంతో ఎదురు చూస్తూ ఉంటారు ఇక చీకటి పడుతున్న తమను ఎవరు రక్షించకపోవడంతో ప్రతి ఒక్కరూ రాముడి పట్ల తప్పుగా మాట్లాడుతూ ఉంటారు.ఇక యుద్ధం పూర్తి అయ్యి సీతమ్మను రక్షించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో రాముడు అందరూ ఉన్నారా లేదా అని గమనించగా 1000 మంది సింగిలీకులు లేరని గుర్తించారు.

 

ఇలా అందరూ వారి కోసం బ్రతుకుతూ ఉండగా రాముడు దృష్టి మాత్రం అక్కడ ఉన్నటువంటి గంట పై పడింది దీంతో హనుమాన్ అంటూ హనుమంతుడికి చెప్పడంతో ఆంజనేయుడు తన తోకను చాలా పెద్దగా చేసి తోక సహాయంతో ఆ గంటను పైకి తీస్తారు అప్పుడు అందులో ఉన్నటువంటి వెయ్యి మంది సింగిలీకులు బయటకు రావడంతో అందరూ సంతోషంగా తిరిగి వెళ్తారు అందుకే హనుమంతుడి తోకకు ఉన్నటువంటి గంట ఉన్న చిత్రపటాన్ని కనక పూజిస్తే వారిపై హనుమంతుడి అనుగ్రహం రెండింతలు ఉంటుందని భావిస్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -