Krithi Shetty: కృతిశెట్టి నానిని ఇంత ఘోరంగా అవమానించిందని మీకు తెలుసా?

Krithi Shetty: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే మొదట్లో ఆమె నటించిన సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో లక్కీ హీరోయిన్ అంటూ ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెను పట్టించుకోవడమే మానేశారు.

ఇది ఇలా ఉంటే కృతి శెట్టి తాజాగా నటించిన చిత్రం కస్టడీ. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే మే 12వ తేదీన విడుదల విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కృతిశెట్టి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీకు సమంత లాగా ఐటెం సాంగ్స్ చేసే ఆఫర్ వస్తే చేస్తారా అని ప్రశ్నించగా.. నాకు అలాంటివి చేయడం అస్సలు ఇష్టం లేదు. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు చేశాను. హీరో నానితో లిప్ లాక్, రొమాన్స్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. చాలా కష్టంగా అనిపించింది.

 

అప్పుడే నాకు ఇష్టం లేని పనులు చేయొద్దని నిర్ణయించుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కృతి శెట్టి. కాగా కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలపై నాని అభిమానులు మండిపడుతున్నారు. ఉప్పెన సినిమాలో కూడా లిప్ లాక్ ఇచ్చావ్ కదా,అప్పుడెందుకు ఇలా అనలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా మాట్లాడటం ఒక రకంగా నానిని అవమానించడమే అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -