Krithi Shetty: ఆ హీరోతో చచ్చినా సినిమా చేయకు.. కృతిశెట్టికి తల్లి ఇచ్చిన వార్నింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Krithi Shetty: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి మనందరికి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమె వరుసగా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. కానీ అవన్నీ కూడా ఫ్లాప్ గానే నిలిచాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ఉంచుకోవడంతో పాటు వరుస గ్లామర్ ఫోటోషూట్స్ కూడా చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమెకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.. ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోతో సినిమా చేయకూడదు అని ప్రామిస్ చేయించుకొని మరి ఆమెను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసిందట వాళ్ళ అమ్మగారు. దానికి కారణం ఆ హీరోకి ఆమె పెద్ద ఫ్యాన్ కావడం.

ఎంత అంటే ఆయన ఫొటోస్ ఇప్పటికీ ఆమె బెడ్ రూమ్ లో ఉంటాయట. అంత పెద్ద ఫ్యాన్. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవికి కృతిశెట్టి అమ్మగారు చాలా పెద్ద ఫ్యాన్. అందుకే ఆయనతో సినిమాలు చేసే ఛాన్స్ వస్తే కేవలం కూతురి పాత్ర చెల్లెలి పాత్రలు గానే చేయాలి తప్పిస్తే హీరోయిన్ గా మాత్రం చేసే ఛాన్స్ వస్తే అసలు ఆయనతో సినిమా చేయకూడదు. అలా అయితేనే నిన్ను సినిమాలోకి యాక్సెప్ట్ చేస్తాను అంటూ సినిమాలోకి పంపించడానికి క్రేజీ కండిషన్ పెట్టిందట.ఆ కండీషన్ ఓకే చేసి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చిందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు క్రేజీగా స్పందిస్తున్నారు. ఇంకొందరు చాలా విచిత్రంగా ఉంది. అంత పెద్ద స్టార్ హీరో సరసన నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ వద్దనుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -