Samantha-Krithi Shetty: ఖుషీ సినిమాలో సమంతను తీసేశారా.. కృతిశెట్టి హీరోయినా?

Samantha-Krithi Shetty: విజయ్ దేవరకొండ-సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా 60 శాతం వరకు పనులు పూర్తి చేసుకుంది. కానీ సమంత అరుదైన వ్యాధి మాయోసైటిక్ బారిన పడిన విషయం తెలిసిందే. సమంత అనారోగ్యం నుంచి కోలుకునేంత వరకు సినిమాను నిలిపివేశారు. దీంతో సమంత-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు.

 

సమంత ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగు పడినప్పుడే.. షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమంత వ్యాధి నుంచి ఎప్పుడు కోలుకుంటుందో?.. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో? తెలియకపోవడం వల్ల.. ఆమె స్థానంలో కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

సమంత ప్లేస్‌లో కృతిశెట్టి వస్తోందా? అనే ప్రశ్నపై కృతి స్పందించింది. ‘ఖుషీ సినిమా సగానికి పైగా పూర్తయింది. ఇలాంటి టైంలో సమంతను తప్పించి వేరే హీరోయిన్‌ను ఎవరూ తీసుకోరు. ఈ సినిమాలో సమంత మాత్రమే హీరోయిన్. మరో హీరోయిన్‌కు స్కోప్ లేదు.’ అని చెప్పుకొచ్చింది. యశోద సినిమా తర్వాత రెస్ట్ తీసుకుంటున్న సమంత.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే ‘ఖుషీ’ సినిమా సెట్స్ కి వస్తానని చెప్పినట్లు సమాచారం. కానీ తాజాగా ఖుషీ చిత్ర బృందానికి ఓ మెసేజ్ వచ్చిందట.

 

తన వల్ల టీమ్ అందరూ వెయిట్ చేయడం ఇష్టం లేదని, త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయమని సమంత చెప్పిందట. దాంతో ఖుషీ తదుపరి షెడ్యూల్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 14వ తేదీ నుంచి ‘ఖుషీ’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే సమంత అదే రోజు షూటింగ్‌లో పాల్గొంటారా? లేదా కొద్ది రోజుల వరకు టైం తీసుకుంటారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ‘ఖుషీ’ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిసి అభిమానులు సంతోష వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -