LEO Movie: లియో చిత్రంలో సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

LEO Movie: రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో లియో కూడా ఒకటి. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన లియో సినిమా పర్వాలేదని అనిపించింది. కొంతమంది సూపర్ హిట్ అంటే మరి కొందరు యావరేజ్ సినిమా ఇది విజయ్ రేంజ్ కి తగ్గ సినిమా కాదని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ విడుదలైన మొదటి షోకే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చాక్లెట్ కాఫీ అనే ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.

సినిమా ప్రారంభం నుండి సీరియల్ కిల్లర్స్ మర్డర్స్ చేస్తూ, ఒకరోజు రాత్రి విజయ్ నడుపుతున్న కాఫీ షాప్ లోకి వస్తారు. ఇక రాత్రి అయ్యింది షాప్ మూసేసారు అని చెప్పినా వినకుండా చాక్లెట్ కాఫీ అని పదే పదే హీరోని అడుగుతాడు. ఈ ఎపిసోడ్ లో వచ్చే ఫైట్ సీన్ సినిమాకి పెద్ద హైలైట్. అయితే ఇందులో సీరియల్ కిల్లర్ గా నటించిన ఆ వ్యక్తి ఎవరు?, చూస్తుంటే అచ్చం అర్జున్ దాస్ లాగా అనిపిస్తున్నాడు కానీ, అతను కాదు. దాంతో నెటిజెన్స్ గూగుల్ లో గత రెండు రోజుల నుండి వెతకడం మొదలు పెట్టారు. అలా నెటిజెన్స్ అతని గురించి సెర్చ్ చేయగా కొంచం సమాచారం ప్రకారం బయటపడింది.

ఆ సీరియల్ కిల్లర్ పాత్ర పోషించిన వ్యక్తి పేరు శాండీ. అందరూ ఇతనిని శాండీ మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. ఇతను ఒక్క పెద్ద డ్యాన్స్ మాస్టర్. ఒక కొరియోగ్రాఫర్. కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోని చార్ట్ బస్టర్ సాంగ్స్ కి కోరియోగ్రఫీ చేసాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన విజయ్ వారిసు చిత్రం కూడా కొన్ని సాంగ్స్ కి ఇతను కొరియోగ్రఫీ చేసాడు. అలా కొరియోగ్రాఫేర్ గా కొనసాగుతూనే మద్యమద్యలో ఏదైనా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఇస్తే వదులుకోకుండా చేస్తూ వచ్చాడు, కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ లియో చిత్రం విడుదలైన తర్వాత ఇతను సౌత్ ఇండియా మొత్తం సెన్సేషనల్ టాపిక్ అయిపోయాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -