LEO Movie: బాలయ్యపై కోపంతో లియోకు మద్దతు ఇస్తున్న మెగా ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

LEO Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పటినుంచో పోటీ ఉండే ఉంది. ఇద్దరు హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే అభిమానుల మధ్య ఉండే గొడవలు అభిమానులు చేసే హంగామా ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. ఇక ఈ ఏడాది చిరంజీవి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానుల మధ్య ఎలాంటి పోటీ వాతావరణం నెలకొందో మనకు తెలిసిందే.

ఇలా వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడి రెండు సినిమాలు కూడా కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించుకున్నాయి అయితే ఈ రెండు సినిమాలు సోలోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే కనుక కలెక్షన్ల విషయంలో మరోలా ఉండేది అని ఇప్పటికీ విశ్లేషకులు ఈ సినిమా విడుదల పట్ల వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇకపోతే చిరంజీవి నటించిన భోళా శంకర్ విడుదల సమయంలో ఆయన పై ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో మనకు తెలిసిందే. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

మరికొన్ని గంటలలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి అయితే ఇదే రోజున కోలీవుడ్ నటుడు విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి లియో సినిమా కూడా తెలుగులో ఘనంగా విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో మెగా అభిమానులు బాలయ్య పై ఉన్న కోపంతో లియో సినిమాకు మద్దతు తెలుపుతున్నారని తెలుస్తోంది.

ఈసారి మెగా అభిమానులు కూడా బాలయ్య సినిమాకే మద్దతు తెలపాల్సి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని వచ్చే ఎన్నికల బరిలో దిగబోతున్నారు ఇలాంటి సమయంలో బాలయ్య మెగా ఫాన్స్ ఒకటవాల్సింది పోయి బాలయ్య సినిమా సక్సెస్ కాకూడదు అన్న ఉద్దేశంతో మెగా అభిమానులు లియో సినిమాకు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా సపోర్ట్ చేస్తున్నప్పటికీ బాలయ్య సినిమా విజయం సాధిస్తే పర్వాలేదు కానీ ఏ మాత్రం తేడా వచ్చినా భారీ ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తుంది. మరి బాలయ్య వన్ సైడ్ విక్టరీ సాధించిన లేక ట్రోల్స్ ఎదుర్కొనేనా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -