Ravanasura: రావణాసురుని పది తలల వెనుక అసలు మిస్టరీ మీకు తెలుసా.. ఆ రీజన్ వల్లే పది తలలున్నాయా?

Ravanasura:  మామూలుగా ప్రతి ఒక్కరికి రామాయణం గురించి తెలిసే ఉంటుంది. రామాయణం కి సంబంధించి ఇప్పటికే ఎన్నో సినిమాలు కూడా విడుదల అయ్యాయి. రామాయణం పేరు వినగానే చాలా రకాల పాత్రలు గుర్తుకు వస్తూ ఉంటాయి. వాటిలో రావణాసురుడు పాత్ర కూడా ఒకటి. రావణాసురుడు కూడా రామాయణంలో ఎంతో ముఖ్యమైన వాడు. ఇక అందులో రావణుడికి పది తలలు ఉన్న విషయం చూసే ఉంటాం. అయితే రావణుడికి పది తలలు ఎందుకు ఉంటాయి? అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మరి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రావణుడికి పది తలలు ఉండడం వెనుక అనేక రామాయణ గాథల్లో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణుడు తపశ్శాలి, బలిశాలి. ఋషుల శాప ప్రభావం కారణంగా వైకుంఠ ద్వార పాలకులైన జయ, విజయలు త్రేతా యుగంలో రావణుడిగా, కుంభకర్ణుడిగా పుట్టారు. విచిత్ర రామాయణం ప్రకారం చూసినట్లయితే విశ్వవసు ఒక రోజు దాంపత్య సుఖాన్ని అనుభవించాలని తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమె 11 సార్లు రుతిమతి అయినట్లు విశ్వవసు తెలుసుకుంటాడు. అయితే ఆమె ద్వారా 11 మంది పుత్రులని పొందాలని భావిస్తాడు. కానీ ఆమె కేవలం ఇద్దరు పుత్రులని మాత్రమే కావాలని కోరుకుంటుంది. దీంతో అతను 10 తలలు ఉన్న రావణుడిని, 11వ‌ వాడిగా కుంభకర్ణుడిని ఇచ్చినట్లు విచిత్ర రామాయణం ప్రకారం తెలుస్తోంది.

అలాగే విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశ్య‌పుడిని సంహరిస్తాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా పుట్టి 20 గోళ్ళతో నన్ను ఒక్కడిని చంపడం కూడా ఒక పౌరుష‌మేనా అని హిరణ్యకశ్య‌పుడు ఆక్షేపిస్తాడట. తర్వాత జన్మలో శ్రీహరి నీకు 10 తలలు, 20 చేతులు ప్రసాదించి, మానవుడిగా అవతరించి సంహరిస్తానని విష్ణుమూర్తి చెప్పినట్లు ఒక కథ ఉంది. వాల్మీకి రామాయణంలో చూసుకుంటే ఇటువంటి వాటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కామరూప విద్యతోనే పది తలలు ఏర్పడ్డాయని కొందరు అంటుంటారు. ఇలా రావ‌ణుడి 10 త‌ల‌ల వెనుక ప‌లు క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -