Suresh Babu: సుధీర్ వర్మ ప్రమోషన్స్ కి రాకపోవడానికి కారణం సురేష్ బాబునా?

Suresh Babu: సాధారణంగా సినిమా ప్రమోషన్ కి దర్శకులు దూరంగా ఉంటారు. ఎందుకంటే మీడియం ముందరకొచ్చి మాట్లాడడానికి కొంతమంది డైరెక్టర్లు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అంతేకాకుండా కొంతమంది డైరెక్టర్లు షూటింగ్ జరిగే సమయంలో వారికి చిన్న చిన్న క్లాసెస్ ఎదురవుతాయి. ఈ క్లాసెస్ కారణంగా చాలామంది డైరెక్టర్లు సినిమా ప్రమోషన్ లో కనిపించరు.

ఇదిలా ఉంటే డైరెక్టర్ సుధీర్ వర్మ తాను డైరెక్ట్ చేసిన ‘షాకిని డాకిని’ సినిమా ప్రమోషన్ లో కనిపించడం లేదు అన్న రూమర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ రూమర్ కి ఆ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. ఇక అదే నిర్మాత సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మా డైరెక్టర్ ప్రమోషన్ లో కనిపించకపోవడానికి కారణం అతడు రవితేజతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. దీని గురించి మేము ఇది వరకే వెల్లడించామని తెలిపాడు.

కాగా ఈనెల 14 వరకు ఆయన రావణాసుర షూటింగ్లో ఉంటాడట. దీని కారణం చేత మొన్న ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాలేదని తెలిపాడు. ఇక 15 నుంచి సుధీర్ వర్మతో ప్రమోషన్ లో భాగంగా పాల్గొంటారని తెలిపాడు. ఈ మాటలో విన్న కొందరు సుధీర్ వర్మ రిలీజ్ అయినందుకు రాలేనంత బిజీనా? అన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చేతిలో ఎంత పెద్ద సినిమా ఉన్నప్పటికీ షూటింగ్ ముగిశాక స్టేజ్ పై నాలుగు ముక్కలు మాట్లాడే అంత తీరిక కూడా లేదా అని కొందరు మాట్లాడుతున్నారు.

ఇక సినిమా షూటింగ్ సమయంలో ఏం జరిగిందో కానీ సుధీర్ వర్మ మాత్రం ప్రమోషన్ కి రాకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఇక తాజాగా రిలీజ్ అయిన కొత్త సినిమా గురించి ట్వీట్ చేస్తూ తెలిపాడు కానీ.. ఆయన దర్శకత్వంలో వచ్చిన శాకినీ డాకిని సినిమా గురించి ఒక ట్వీట్ కూడా చేయలేదు. మరి ఇదంతా చూస్తుంటే ఇటీవల సురేష్ బాబు ఇన్వాల్వ్ అవ్వడం.. సుధీర్ వర్మ తో మాట్లాడడం ఇలాంటివన్నీ వట్టి మాటలేనా అనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -