Ravanasura: రావణాసుర వెనుక షాకింగ్ సీక్రెట్.. ఏం జరిగిందంటే?

Ravanasura: సాధారణంగా ఒక సినిమా విడుదలవుతుంది అంటే నిర్మాతలు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, సినిమా ఏ విధమైనటువంటి కలెక్షన్లు రాబడుతుందన్న ధోరణిలో నిర్మాతలు సినిమా విడుదల అయ్యేవరకు అనుక్షణం ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమా విషయంలో నిర్మాతలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది.మరి ఈ హ్యాపీనెస్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఏంటి అనే విషయానికి వస్తే…

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రావణాసుర.ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు అభిషేక్ నామ నిర్మాతగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే.రైటర్ శ్రీకాంత్ ఈ సినిమా కథ రవితేజకు చెప్పగానే ఈ సినిమా ఎంతో నచ్చడమే కాకుండా సినిమాపై 100% నమ్మకంతో ఈ సినిమా నిర్మాణంలో రవితేజ కూడా భాగస్వామ్యం అయ్యారు.

 

ఈ విధంగా ఈ సినిమా నిర్మాణంలో రవితేజ భాగం కావడంతో నిర్మాత చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా నాన్ థియేటర్ బిజినెస్ దాదాపు 43 కోట్లు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించినందుకు హీరోకు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతవరకు లాభాలు వస్తే వాటిని ముందుగా అభిషేక్ రవితేజ అనుకున్న ప్రకారం లాభాలను పంచుకుంటారు.

 

సినిమా మంచి హిట్ అయితే రవితేజ రెమ్యూనరేషన్ మేరకు ఆదాయం వస్తుందని చెప్పాలి. ఇక నాన్ థియేటర్లో ఏదైనా మిగిలితే అది వారికి లాభంగానే ఉంటుంది. ఈ సినిమాకు పెద్దగా నష్టాలు వచ్చే దాఖలాలు ఎక్కడా కనపడలేదు. అందుకే ఈ సినిమా విషయంలో నిర్మాత అభిషేక్ నామ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా హీరోలు నిర్మాణంలో భాగస్వామ్యం అయితే హ్యాపీగా ఉంటారని రావణాసుర విషయంలో కూడా ఇదే సీక్రెట్ దాగి ఉందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -