Viral: ఈ భార్యలు భర్తలను మార్చుకోవడం వెనుక అసలు కథ తెలుసా?

Viral: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రపంచం నలుమూలల ఏ జరిగిన కూడా క్షణాల వ్యవధిలోని తెలుసుకోగలుగుతున్నారు. నిత్యం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వింత ఘటనలు,దారుణమైన ఘటనలు,ఆశ్చర్యపరిచే ఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోలు భయబ్రాంతులకు లోనవుతూ ఉంటారు. మరికొన్ని ఘటనలు చూసినప్పుడు ఛీఛీ మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది.

ఇటీవల బీహార్ లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇందుకు ఉదాహరణ గా చెప్పవచ్చు. అసలు విషయానికి వస్తే.. బీహార్ లో రూబీ,దేవి అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. రూబీ నీరజ్ కుమార్ అనే అతనిని 2009 లో పెళ్లి చేసుకుంది. అయితే ఆమెకి దేవి అనే స్నేహితురాలు ఉంది. దేవి భర్త పేరు ముఖేష్ కుమార్. ఈ రెండు జంటలు తరుచు కలుస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే రూబీ తన స్నేహితురాలు దేవి భర్త ముఖేష్ కుమార్ పై మనసు పడింది. అలా వారిద్దరూ కొంతకాలం పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమయనాన్ని నడిపారు.

 

మరోవైపు ముఖేష్ కుమార్ భార్య దేవి రూబీ భర్త నీరజ్ పై మనసు పడింది. వీళ్లిద్దరు కూడా ఒకరినొక్కరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే ఒక రోజు ముఖేష్ కుమార్ తన భార్య దేవి, నీరజ్ కుమార్ తో కలిసి తిరగడం, ఫోన్ లో మాట్లాడుకోవడం, వాట్సాప్ లో రొమాంటిక్ చాట్ చేసుకోవడం ఇలాంటివన్నీ గమనించాడు. చిక్కింది ఛాన్స్ అని అనుకోని ముఖేష్ కుమార్ రూబీ తో తనకి ఉన్న రేలషన్ గురించి దేవికి చెప్పి, ఆ తర్వాత నలుగురు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని ఒకరి భర్తని ఒకరు మార్చుకున్నారు. ఫిబ్రవరి నెలలో వీళ్ళ పెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. ఈ నీచమైన ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -