Chandrababu Wife: తాను సైతం అంటున్న చంద్రబాబు భార్య.. పొలిటికల్ లెక్కలు మారుతాయా?

Chandrababu Wife: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మొట్టమొదటిసారి ప్రజల మధ్యకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. భువనేశ్వరి ఇప్పటివరకు ఎప్పుడు ప్రజా క్షేత్రంలోకి రాలేదు. తన తండ్రి ఎన్టీఆర్ హయాంలో అయినా తన భర్త చంద్రబాబు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో కూడా భువనేశ్వరి ఏనాడు ప్రజాక్షేత్రంలోకి రాలేదు.

హెరిటేజ్ కార్యకలాపాలను మాత్రం చూసుకునేవారు. అయితే లోకేష్ హెరిటేజ్ పగ్గాలు చేపట్టిన తర్వాత అందులో కూడా తన ప్రమేయాన్ని తగ్గించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి వెన్ను దన్ను గా నిలిచేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. మొట్టమొదటిసారిగా తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచే రాజకీయ కార్యకలాపాలకు నేను సైతం అంటూ శ్రీకారం చుట్టటానికి ఆసక్తి కనబరుస్తున్నారంట నారా భువనేశ్వరి.

 

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొబైల్ వైద్య సేవలు సూపర్ సిక్స్ పథకాలపై మహిళలలో నిర్వహించే సమావేశాల్లో భువనేశ్వరి పాల్గొంటారని.. తర్వాత తెలుగు యువత చేపట్టే సైకిల్ యాత్రని ఆమె ప్రారంభిస్తారని.. వచ్చే నెల మొదటి వారంలో కుప్పంలో భువనేశ్వరి పర్యటిస్తారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలియజేశారు. అలాగే తెలుగు యువత చేపట్టే సైకిల్ యాత్రని భువనేశ్వరి ప్రారంభించడం ద్వారా రాజకీయ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటారని.. పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం.

 

కాబట్టి భర్తకి తోడుగా నేను సైతం అంటూ అడుగు ముందుకు వేస్తున్నారు భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలను చాలా కాలంగా భువనేశ్వరి పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి టీడీపీ మినీ మహానాడు ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించి వాటిని జనాల్లోకి విస్తృతంగా తీసుకోవాలని భువనేశ్వరి గట్టి పట్టు మీద ఉన్నారట. చూడాలి మరి భార్య సహకారంతో అయినా చంద్రబాబు నాయుడుకి పీఠం దక్కుతుందేమో.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -