Devotional: గర్భవతిగా ఉన్న స్త్రీలు.. పూజలు వ్రతాలు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Devotional: సాధారణంగా స్త్రీలకు భక్తి భావం అధికంగా ఉంటుంది. పూజలు,వ్రతాలు, నోములు అంటూ కుటుంబ బాధ్యతతో పాటు పూజ కోసం కూడా ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇంట్లో పూజలు చేసుకోవడంతో పాటు ఆలయాలకు వెళ్లి పూజలు చేసుకోవడం అభిషేకాలు చేయించడం వ్రతాలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. శ్రావణమాసం మాఘమాసం కార్తీక మాసంలో, వరలక్ష్మీ వ్రతం దసరా నవరాత్రులు ఇలా ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు వ్రతాలు చేయవచ్చా? ఒకవేళ చేస్తే ఏదైనా సమస్యలు వస్తాయా? ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గర్భవతి ఉన్న స్త్రీ ఉండే గృహప్రభావం ఆమెపైన అలాగే ఆమె గర్భంలో ఉన్న శిశువుపైన కూడా పడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మూడు నెలల గర్భవతి అయిన తర్వాత ఇంటికి సంబంధించిన మార్పులు అలాగే కొత్తగా ఇంటిని నిర్మించడం లాంటివి చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటపుడు పూర్తిగా చేయకపోయినా, కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం వలన ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇంటికి మార్పులు, చేర్పులు కాని, కొత్త నిర్మాణం చేయకూడదు. గర్భవతిగా ఉన్న స్త్రీలు పూజలు వ్రతాలు చేయవచ్చా ఒకవేళ చేస్తే ఎన్ని నెలల వరకు చేయాలి? అని సందేహ పడుతూ ఉంటారు.

ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఏం చేయాలో ఎవరి మాట వినాలో తెలియక అయోమయపడుతూ ఉంటారు. మరి ఈ విషయం గురించి శాస్త్రం ఏం చెబుతోంది అన్న విషయానికి వస్తే.. గర్భవతులు పూజ చేయవచ్చు కానీ కొబ్బరి కాయను మాత్రం కొట్టకూడదు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. అలాగే కొత్త పూజ విధానాలను ప్రారంభించడం పుణ్యక్షేత్రాలు దర్శించడం లాంటివి చేయకూడదు. అలాగే గర్భవతులు ధ్యానం చేయడం మంచిది. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు 5వ నెల వచ్చే వరకు వ్రతాలు పూజలు చేయవచ్చు. తర్వాత చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే వ్రతాలు, పూజలు అని ఎక్కువసేపు నేలపై కూర్చోవడం మంచిది కాదు. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగాఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -