Anjaneyaswamy: ఆంజనేయస్వామికి ఎర్ర సింధూరం వెనక అసలు రహస్యాలు ఇవే!

Anjaneyaswamy: హిందువులు తమ తమ ఇష్టదేవుళ్లను పూజిస్తుంటారు. చాలా మంది ఆంజనేయస్వామిని పూజిస్తుంటారు. అతడిని ఇష్టవైవంగా భావిస్తూ పూజలు చేస్తుంటారు. అందరికి ఆంజనేయ స్వామి అంటే ఠక్కున గుర్తుకొచ్చేది సింధూరమే అన్న విషయం అందరికీ తెలిసిందే. వివిధ దేవుళ్లకు కుంకుమ, పసుపు, ఇతర వస్తువులు పెట్టి పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. అన్ని ఆంజనేయస్వామికి మాత్రం ప్రత్యేకంగా సింధూరం పెడుతుంటారు. అలా సిందూరమే ఎందుకు పెడతారంటే..

రాముడు రావణసూరుడి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రాముడు ఆంజనేయుడి భుజాలపై ఎక్కి యుద్ధం చేశాడు. ఆ సమయంలో రావణాసురుడు సంధించిన బాణాలు ఆంజనేయునికి తగిలి ఒళ్లంతా రక్తంతో నిండిపోయింది. అయినా కూడా ఆంజనేయుడు ఏమాత్రం అదుపుతప్పకుండా స్థిరంగా నిలబడి యుద్ధాన్ని కొనసాగించేలా చేశాడరి రామాయణం చెబుతోంది.యుద్ధం ముగిసేటప్పటికి ఆంజనేయుని దేహం పూచిన మోదుగ చెట్టులా మారిందని వాల్మీకి మహర్షి రామాయాణంలో వర్ణించాడు.

రాముడు తనకోసం రక్తమోడిన ఆంజనేయుడిని చూసి ఎంతో మెచ్చి ఆ రంగులో ఉన్న సింధూరాన్ని ఆంజనేయుని మేనికి పూస్తే ఆనాటి సంఘటన గుర్తొచ్చి ఆనందంతో పరవశించిపోతానని చెప్పాడట. ఆ కారణంగానే ఆంజనేయ స్వామి సింధూరం అంటే ఇష్టపడతాడని చెబుతుంటారు. అదీగాక రక్తం రంగు పరాక్రమం, త్యాగం, పవిత్రతలకు ప్రతీక కూడా అందుకే సింధూరాన్ని బొట్టుగా పెడతారని హిందువులు నమ్ముతుంటారు.ఈ కారణంగానే ఆంజనేయుడికి ఎవరు పూజ చేసినా సింధూర తిలకాన్ని పెడతారు. భక్తులు సైతం నుదుట సింధూరాన్ని పెట్టుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -