GOD: దేవుడంటే భక్తి లేదా.. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తారా?

GOD: పురిషాధిక్యత ఉన్న ఈ సమాజంలో మహిళా దినోత్సవం జరపటం ఎంతో ముఖ్యం. అందుకే ఏటా ఈ తేదీన మహిళా దినోత్సవం జరుపుతారు. అయితే ఈ దినోత్సవాన్ని పురుష్కరించుకొని బాడీబిల్డింగ్ పోటీలు పెట్టారు. కండలు తిరిగిన మహిళలు, యువతులు అక్కడకు చేరుకున్నారు. పెద్ద స్టేజ్ పై లేడీ బాడీ బిల్డర్లు తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించారు. మగవారికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఔరా అనిపించారు.

 

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బాడీ బిల్డింగ్ పోటీలు పెట్టడం తప్పేమీ కాదు. కానీ అక్కడే చిన్న చిక్కొచ్చింది. ఆ స్టేజ్ పై ఆంజనేయుడి కటౌట్ పెద్దది పెట్టారు. ఆంజనేయుడి బొమ్మ ముందే మహిళలు బికినీల్లో వచ్చి తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించడం ఇప్పుడు ఇది రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సహజంగా ఇలాంటి తప్పులు కాంగ్రెస్ నాయకులు చేస్తే దేశవ్యాప్తంగా రచ్చ రచ్చ జరిగేది. కానీ ఇక్కడ ఈ తప్పు చేసింది బీజేపీ నేతలు. మధ్యప్రదేశ్ లోని రత్లాం పట్టణంలో ఈ పోటీ జరిగింది. హనుమంతుడి బొమ్మ ముందే ఆడవాళ్లు అంగాంగ ప్రదర్శన చేయడమేంటనే విమర్శలు వినపడుతున్నాయి. బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరీ దారుణం అని విమర్శిస్తున్నారు.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా, రత్లాం మేయర్ ప్రహ్లాద్ పటేల్ ఈ పోటీలు నిర్వహించారని, ఇది తప్పుడు సంకేతాలను పంపుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హనుమంతుడి కటౌట్ ముందు మహిళలు తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించడాన్ని తప్పుబడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ స్టేజ్ ని గంగాజలంతో శుద్ధి చేశారు. అక్కడ హనుమాన్ చాలీసా పఠించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -