Watermelon: పుచ్చకాయ గింజలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Watermelon: వేసవికాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం రకరకాల కూల్ డ్రింక్స్,జూసులు పానీయాలు తాగుతూ ఉంటారు. వీటితో పాటుగా వేసవికాలంలో దొరికే కర్బూజ పండు దోసకాయ పుచ్చకాయ లాంటివి కూడా తింటూ ఉంటారు. కాగా పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. పుచ్చకాయ తినడం వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవచ్చు. పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు ఉన్నాయి.

పైగా వీటిలో క్యాలరీలు చాలా తక్కువ. అమైనో యాసిడ్ అయిన సిట్రులైన్ మన శారీరక చురుకుదనాన్ని పెంచుతుంది. విటమిన్ సి, కెరొటినాయిడ్, లైకోపీన్, కుకుర్బిటాసిన్ సహా పలు యాంటీఆక్సిడెంట్లు పుచ్చకాయలోని పోషకాలు. ఇకపోతే చాలా మంది పుచ్చకాయ తిన్నప్పుడు వాటి విత్తనాలను అలాగే తినేస్తే మరి కొంత మంది మాత్రం తీసేసి మరి తింటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా తినాలని చూసినా కూడా ఒకటి రెండు విత్తనాలు కడుపులోకి వెళ్తూ ఉంటాయి. చాలామంది భ్రమ పడుతున్నట్టుగా పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. వైద్యులు కూడా పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఏమీ కాదని అంటున్నారు. పుచ్చకాయలు అనేక రకాలు ఉన్నాయి.

 

వాటిలో అన్ని రకాల పుచ్చకాయల్లో విత్తనాలు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు హానికరం అనే భయంతో వాటిని తినకుండా పారేస్తూ ఉంటారు. అవన్నీ ఒట్టి అపోహలు మాత్రమే. పుచ్చకాయ గింజల వల్ల లాభాలు కూడా ఉన్నాయి. పుచ్చకాయ విత్తనాల్లో గ్లోబ్యులిన్, ఆల్బుమిన్ అనే ప్రొటీన్స్, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. అవి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాయి. దీంతో రోగాలు దరిచేరవు. రక్తంలో ద్రవాలు బాగా రవాణా అవుతాయి. బాడీలో చెడు కొవ్వుని కరిగించి బయటికి పంపిస్తాయి. ఫలితంగా గుండెకి మేలు కలుగుతుంది. బీపీ, షుగర్ కంట్రోల్ అవుతాయి. పుచ్చ గింజల్లోని ఎల్ ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ వల్ల గాయాలు త్వరగా నయమవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -