Health tips: వేసవి తాపం నుంచి బయటపడాలంటే.. ఈ పండ్లు తినాల్సిందే?

Health tips: వేసవికాలం మొదలయ్యింది. ఎండలు మండి పోతున్నాయి. ఈ ఎండలకు ప్రజలు డీహైడ్రేషన్ భారీన పడకుండా శరీరాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల పానీయాలు తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్, చెరుకు రసం,కొబ్బరి నీళ్లు ఇలా దాహార్తిని తీర్చుకోవడానికి ఏదో రకమైన పానీయాలు సేవిస్తూ ఉంటారు. అయితే వాటితో పాటుగా ఎండాకాలంలో మజ్జిగ రాగి జావ వంటివి తీసుకోవాలి. మరి ముఖ్యంగా వీలైనంతవరకు ఎండాకాలం కుండలో ఉన్న నీటిని తాగడం మంచిది. అలాగే ఎక్కువ శాతం నీరు ఉన్న పండ్లను తీసుకోవాలి. మరి ఎక్కువ శాతం ఉన్న పండ్లు ఏవి?వాటిని తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేసవిలో తీసుకోవాల్సిన పండ్ల లో పుచ్చకాయ కూడా ఒకటి.. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పుచ్చకాయలో ఉన్న సిట్రులైన్ అమైనో ఆమ్లం అర్జినిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే వేసవిలో తినాల్సిన వాటిలో స్ట్రాబెర్రీ కూడా ఒకటి. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, బి విటమిన్ల వంటి పోషకలు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీలలో ఉండే ఫైబర్ అధిక కంటెంట్ సున్నితమైన జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పీచ్ పండ్లు.. వీటిలో అధికంగా బీటా కెరోటిన్, లైకోపీన్, లుటిన్ లతో నిండి ఉటుంది.

 

ఇవి మన కళ్ళకు, హృదయానికి చాలా మంచివి. పీచ్‌లో నీరు 88 శాతం ఉంటుంది. పీచ్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది . విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల, పీచెస్ చర్మానికి అనుకూలమైన ఆహారాలలో ఒకటిగా చెప్పవచ్చు. అనాస పండు లేదా పైనాపిల్‌లో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి గొంతు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. వేసవిలో ఈ పండును తప్పకుండా తీసుకోవాలి. ఆప్రికాట్లు.. ఆప్రికాట్లలో వాల్యూమ్‌కు 86 శాతం నీరు ఉంటుంది. తక్కువ కేలరీలు మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆప్రికాట్లు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మ నిగారింపుకు, దృష్టిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
కీరదోస..

 

కీర దోసలో 95 శాతం నీరు ఉంటుంది. శరీరాన్ని చల్లబరచడంతో పాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కీరా ముక్కలు చక్రాల్లా కట్ చేసి కళ్ల మీద పెట్టుకుంటే అలసట తగ్గడంతో పాటు కంటి కింద ఉన్న నల్లటి చారలు తగ్గుముఖం పడతాయి. కర్బూజ ఈ పండ్లు.. ఈ పనులు మనకు వేసవికాలంలో విరివిగా దొరుకుతూ ఉంటాయి. వీటిలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. కంటి చూపు సమస్యను తగ్గిస్తాయి. విటమిన్ కే, ఈలు శరీరంలో రక్తప్రసరణ సరిగే జరిగేలా చేస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -