Vitamin B12 Foods: ఏ ఏ పదార్థాల్లో విటమిన్‌బీ–12 ఉంటుంది తెలుసా?

Vitamin B12 Foods: మనం ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషకాహారాలు తీసుకుంటాము. శరీర ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషించే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాల్లో విటమిన్‌ బీ–12 అతి ముఖ్యమైంది. ఆహారం నుంచి శక్తి విడుదల కావాలన్నా, ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావాలన్నా ఇవి ఎంతో అవసరం. ఆహార పదార్థాల్లో విటమిన్‌ బీ–12 లభిస్తున్నా అంతకంటే ఎక్కువగా అవసరం పడుతుండటంతో మరింతగా తీసుకోవాల్సి వస్తోంది. శరీరానికి బలమిచ్చి.. నీరసాన్ని తొలగించేందుకు విటమిన్‌ బీ–12 ఎంతో దోహద పడుతోందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.

గుడ్లు..

కోడి గుడ్లలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లతో పాటు విటమిన్‌ బీ–12 ఎక్కువగా ఉంటుంది. ఒక గుడ్డులో దాదాపుగా 1.4 మైక్రో గ్రామలు బీ–12 ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ గుడ్లను అల్పాహారంలో తీంటే శరీరానికి బీ–12తో పాటు మరిన్ని పోషకాలు లభిస్తాయి. సెలీనియం, క్లోరిన్‌ వంటి సూక్ష్మపోషకాలు శరీరంలో జీవక్రియలు బాగుండటానికి, కాలేయం పనితీరు మెరుగు పర్చడానికి సహకరిస్తాయి.

న్యూట్రిషనల్‌ ఈస్ట్‌..

ఇళ్లలో వండే వంటల్లో ఈస్ట్‌ను ఉపయోగిస్తుంటాం. అందులో న్యూట్రిషనల్‌ ఈస్ట్‌ లభిస్తుంది. చాలా వరకు వీటిలో విటమిన్‌ బీ–12ను కలిపి అందిస్తుంటారు. సాధారణంగా మాంసాహారులకు విటమిన్‌ బీ–12 సులువుగానే లభిస్తుంది. శాకాహారుల్లో చాలా వరకు బీ–12 లోపంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి న్యూట్రిషనల్‌ ఈస్ట్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి ఐదు గ్రాముల న్యూట్రిషనల్‌ ఈస్ట్‌ లో దాదాపు 2.2 మైక్రోగ్రాముల బీ12 లభిస్తుంది.

మేక, గొర్రె మాంసం..

విటమిన్‌ బీ–12 అధికంగా ఉండే ఆహారంలో మటన్‌ పైస్థాయిలో ఉంటుంది. 200 గ్రా. మటన్‌ లో సుమారు 11 మైక్రోగ్రా. బీ–12 ఉంటుంది.. దీనికితోడు ఇతర విటమిన్లు, ప్రొటీన్లు కూడా అందుతాయి. అవి శరీరంలో కండరాలు, ఎముకల బలోపేతానికి తోడ్పడతాయని వైద్య నిపుణులు సూచించారు. ఐరన్, జింక్, సెలీనియం వంటి అత్యవసర మూలకాలు కూడా అందుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎర్రరక్త కణాలు తగిన స్థాయిలో ఉండేందుకు, గాయాలు త్వరగా మానేందుకు, రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండేందుకు ఇవన్నీ అవసరమని చెబుతున్నారు.

పాల పదార్థాలు..

పాలు, వెన్న, పెరుగు, పనీర్‌ వంటి వాటిలోనూ విటమిన్‌ బీ–12 ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్‌ తీయని ఒక కప్పు పాలలో 1.1 మైక్రో గ్రాముల బీ12 లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాలు, పాల పదార్థాల్లో విటమిన్‌ బీ–12 కాల్షియం, ఇతర అత్యవసర పోషకాలూ ఉంటాయి. కాల్షియంతో శరీరంలో ఎముకలు, దంతాలు బలంగా ఉండటంతో పాటు కండరాల పనితీరు మెరుగుపడుతుంది.

సాల్మన్‌ ఫిష్‌..

విటమిన్‌ బీ–12 అత్యధికంగా లభించే ఆహార పదార్థాల్లో సాల్మన్‌ ఫిష్‌ ముందుంటుంది. దీనిలో ప్రతి 100 గ్రాముల ఫిష్‌లో ఏకంగా 4.15 మైక్రో గ్రాముల బీ–12 ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చేపలతో పాటు మరికొన్ని సముద్ర ఉత్పత్తుల్లో కూడా బీ–12 ఎక్కువగా ఉటుంది. దీనిలో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -