Food: అన్నం తినే సమయంలో అస్సలు చెయ్యకూడని తప్పులేంటో మీకు తెలుసా?

Food: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఆ పూటకి భోజనం దొరకదు. అందుకే అలాంటి అన్నాన్ని మనం దైవ స్వరూపంగా భావించి గౌరవించాలి. కానీ నేటి తరంవారు భోజనాన్ని ఒక పద్ధతి లేకుండా దానిని అగౌరవ పరుస్తూ తింటున్నారు.

అలా చేయటం వలన దేవుడు క్షమించడనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అన్నం తినడాన్ని కూడా ఒక పూజ లాగా చేయాలి ఒక పద్ధతితో తినాలి. భోజనాన్ని అచ్చంగా నేల మీద కూర్చొని భోజనం చేయకూడదు. అలా చేయడం వలన మన శక్తిని భూమి ఆకర్షిస్తుంది.

 

అలాగే మంచం మీద కూర్చుని కూడా భోజనం చేయకూడదు. అలా చేయడం వలన ఇంటికి అష్ట దరిద్రం చుట్టుకోవటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇంట్లో గొడవలు పెరగడానికి కారణం అవుతాయి. భోజనం చేసే ముందు తప్పనిసరిగా దైవ ప్రార్థన చేసి భోజనానికి ఉపక్రమించాలి.

 

భోజనాన్ని కెలికినట్లుగా కాకుండా పద్ధతిగా ఒకదాని వెంట ఒకటి కలుపుకుంటూ మెతుకులు కిందన పడకుండా భోజనం చేయాలి. అలాగే తిన్న తర్వాత భోజనం ప్లేటులో చేతులు కడగకూడదు. ఎవరి ఇంటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసి ఆ భోజనంలోని లోపాన్ని ఎత్తి చూపిస్తే మహా పాపం కలుగుతుంది.

 

వంట గదిలో కూర్చుని భోజనం చేయడం వలన మానసిక సమస్యలు వస్తాయి. అందరూ కలిసి భోజనం చేయడం ఉత్తమం. అందరూ పడుకున్న తర్వాత భోజనం చేయడం వలన సంపద కరిగిపోతుంది. కాళ్ళను చాపి ఆహారాన్ని తింటే అప్పులు బాగా పెరిగిపోతాయి. పండగ పూట మాంసాహారం తింటే ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు నశించిపోతాయి.

ఇతరుల ఆహార పదార్థాలను దొంగిలించి తింటే దరిద్రం పట్టి పీడిస్తుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి. పూజ ఎంత శ్రద్ధగా చేస్తారో భోజనం కూడా అంత శ్రద్ధగానే చేయండి. ఆ సమయంలో చికాకు పడడం కేకలు వేయడం లాంటివి చేయకండి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -