Venky Suresh: వెంకీ, సురేష్ బాబు మధ్య ఉన్న ఈ వ్యక్తిని మీరు గుర్తుపట్టారా?

Venky Suresh: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలు వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇలా తమ అభిమాన సెలబ్రిటీలు తమ త్రో బ్యాక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది ఆలస్యం అన్నట్టుగా అభిమానులు సైతం ఆ ఫోటోలను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒక త్రో బ్యాక్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

అయితే ఇందులో సీనియర్ హీరో అయినటువంటి వెంకటేష్ తన అన్నయ్య సురేష్ బాబు మధ్య ఓ కుర్రాడు నిల్చునున్నారు. ఇలా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తూ వెంకటేష్ సురేష్ బాబు మధ్య ఉన్నటువంటి ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా అంటూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

 

ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రేమ కథ సినిమాలకు ఈ హీరో కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.అయితే అనుకున్నంత స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈ హీరో తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో సహాయ నటుడి పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

 

మరి ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా అదేనండి అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి హీరో సుమంత్.వెంకటేష్ సురేష్ బాబు మధ్యలో నిల్చోని దిగినటువంటి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సుమంత్ పలు సినిమాలలో హీరోగా నటించారు. అయితేఈయన నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో సహాయ నటుడు పాత్రలలో నటిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -