Low BP: బీపీ తక్కువ అయిందా? అయితే వెంటనే ఇవి తీసుకోకుంటే ప్రమాదమే!

Low BP:  సాధారణంగా బీపీ అనేది తక్కువ లేదా ఎక్కువగా అవుతుండడం కామనే. ఇది చాలా మందిలో ఉన్న అనారోగ్య సమస్యే. అయితే ఈ బీపీ ని కంట్రోల్ చేయకపోతే మాత్రం మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఒక వేళ బీపీ తక్కువ అయితే గుండె పైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యని లైట్ తీసుకోకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పటికప్పుడు మాత్రలు అందుబాటులో లేకపోయినా మన వంటిట్లో దొరికే పదార్థాల నుంచి మన బీపీ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు:

తక్కువ రక్తపోటు ఉన్న వారు వెంటనే ఉప్పును తీసుకోవాలి. అంటే ఉప్పుని డైరెక్ట్ గా తీసుకోకుండా నిమ్మరసం తో కలిపి తీసుకుంటే తక్కువ రక్తపోటు నుంచి అప్పటికప్పుడు ఉపశమనం పొందవచ్చు. అయితే హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఉప్పును తీసుకోవద్దు అని ఇప్పటికే మీకు తెలిసిన విషయమే .

కాఫీ:

ఆహారం తీసుకోకుండా ఎక్కువ సమయం ఉన్నా మనం లో బీపీ కి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో కాఫీని తీసుకుంటే బీపీని సాధారణ స్థాయికి తీసుకువస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కెఫీన్ కి లో బీపీ ని కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి.

బాదం పప్పు:

బాదం పప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ బాదం పప్పులో కూడా తక్కువ రక్తపోటుని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. రాత్రి పూట నీటిలో కొన్ని బాదం పప్పులను మరిగించి ఆ నీటిని తాగాలి అలాగే ఆ బాదంపప్పు ని మెత్తగా చేసి తినాలి. ఇలా చేయడం వల్ల లో బీపీ కంట్రోల్ అవుతుంది.

నీరు:

మన శరీరానికి నీటి అవసరం ఎంతో అందరికి తెలిసిందే. అయితే శరీరంలో నీటి శాతం తక్కువ అయినప్పుడు లో బీపీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో కొబ్బరి నీరు కానీ నిమ్మరసం కానీ తాగితే ఉపశమనం పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -