Chicken: తక్కువ శాతం కొవ్వు ఉండే మాంసం ఏదో తెలుసా?

Chicken: ఆరోగ్యానికి పౌష్టికాహారం అందించాలంటే కూరగాయలతో పాటు మాంసాహారం కూడా ఎంతో దోహదపడుతుంది.  మాంసహారాల్లో ఎక్కువగా చికెన్‌కు చాలా క్రేజీ ఉంటుంది. అయితే చికెన్‌తో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. పెళ్లి వింధుల్లో చికెన్‌తో వండే వంటకాలు చేస్తూ ఇది ఇంతకు చికెనేనా అని ముక్కున వేలేసుకుంటారు.  దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చికెన్‌కు క్రేజీ ఎంతుందో అని. చికెన్‌ వంటకాల్లో చాలా రకాల ప్రోటీన్లు ఉంటాయి. దాన్ని తింటే రోగనిరోధక శక్తి కూడా త్వరగా పొందవచ్చని ఆహార నిపుణులు సూచిస్తుంటారు.  చికెన్‌ తినడంతో శరీరంలో వచ్చే కొన్ని నొప్పులను తగ్గిస్తోంది.కండరాల పెరుగుదల, ఎముకలు బలంగా ఉండాలని దోహదపడటం తో పాటు కండరాల ఎదుగుదలకు సహకరిస్తోంది.

 

 

 

కోడి మాంసం చాలా ఆరోగ్యంగా ఎంతో రుచిగా ఉండటంతో వంటలలో దీనిని రక రకాలు రూపాలలో చికెన్ ఉత్పత్తులుగా ఉపయోగిస్తున్నారు. చికెన్‌లో మెదడు పనితీరులో పాలుపంచుకునే విటమిన్ల ఖనిజాలు సంవృద్ధిగా ఉంటాయి. విటమిన్ బీ-12 మరియు కోలిన్ ఉంటాయి, ఇవి పిల్లలలో మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి ఎంతో సహకరిస్తాయి. చికెన్‌ తినడంతో వృద్ధుల మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. త్వరగా జీర్ణమయ్యే మాంసకృత్తులు చికెన్ ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇందులో సోడియం కూడా తక్కువగా ఉంటుంది. హై బీపీతో సతమతమయ్యే వారు దీనిని తీసుకోవచ్చు. స్కిన్ లెస్ చికెన్‌లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది.

చికెన్‌లో అతి తక్కువకొవ్వు ఉంటుంది. తొడ, బ్రెస్ట్ మీట్‌లో ఒక గ్రాము మాంసానికి 60 మి.గ్రా. కొవ్వు మాత్రమే ఉంటుంది. దీనిలో ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల మాంసంలో 20 గ్రాముల ప్రోటీన్‌తో చికెన్ అద్భుతమైన మాంసకృతుల వనరుగా ఉంటుంది. పిల్లల పెరుగుదలకు మరియు కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. చికెన్ లో నియాసిన్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -