YS Jagan: జగన్ బొమ్మలతో కూడిన అట్టపెట్టెలలో చీరల పంపిణీ.. ఏపీలో అధికారం కోసం ఇంతకు తెగించారా?

YS Jagan: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అమలులో ఉంది. రాజకీయ పార్టీలు గతంలో లాగే చెలరేగిపోతామంటే కుదరదు. అధికారంలో ఉన్నాం. ఏం చేసిన చెల్లుతుందనుకుంటే.. ఎక్కడిక్కడ సస్పెన్షన్లు తప్పవు. ఇప్పటకే వైసీపీ నేతలతో అంటకాగుతున్న వాలంటీర్లపై వేటు పడుతుంది. ఉద్యోగాలు ఊడుతున్నాయి. అధికారంలో మనం ఉన్నాం… మనకి అడ్డులేదని.. చాలా మంది వాలంటీర్లు చెలరేగిపోయారు. వైసీపీ తరుఫున ఎన్నికల ప్రచారం చేశారు. జగన్ బొమ్మను, స్థానిక అభ్యర్ధి బొమ్మను చూపించి ఓటు వేయాలని ప్రజల్లో తిరిగేవారు. దాంతో పాటు.. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఏ పథకాలు అమలు అయ్యాయో ప్రచారం చేసేవారు. వైసీపీకి ఓటు వేయకపోతే ఆ పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు దిగివారు. ఇంకా మించిపోతే.. ఓటర్ల వ్యక్తిగత సమాచారం తమ దగ్గర ఉందని బెదిరించేవారు. ఈ ఆగడాలు చేసిన ఈసీ చాలా మంది వాలంటీర్లపై వేటు వేసింది. ఓవైపు ఈసీ చర్యలు తీసుకుంటున్నా వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గడం లేదు.

ఎన్నికల కోడ్ కి, ఈసీ ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టడానికి డబ్బు, మద్యం, బోజనాలు, గిఫ్టుల పంపిణీకి తెర తీస్తున్నారు. సత్తెనపల్లి పారిశ్రామిక వాడలో ఓ గోడౌన్‌లో జగన్ ఫోటోతో ఉన్న 5 వేల చీరలను ఈసీ అధికారులు సీజ్ చేశారు. పంచడానికి మీరు సిద్దం అయితే.. వాటిని సీజ్ చేయడానికి మేమూ సిద్దమే అని అన్నట్టు ఈసీ అధికారులు దూకుడు పెంచారు. సత్తెనపల్లిలో మహిళ ఓటర్లను ప్రలోభపెట్టడానికి వైసీపీ నేతలు సిద్దం అయ్యారు. దీంతో.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మైక్ దొరికితే వైనాట్ 175 అంటూ రాగాలు తీసే వైసీపీ నేతలు ఇప్పుడు చీరలు, మద్యంతో ఎందుకు ప్రజలను ప్రలోభ పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చి హామీలన్నీ నెరవేర్చామని చెప్పుకుంటున్నా వైసీపీ నేతలకు ఎందుకంత భయమని నిలదీస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే.. గెలిపిస్తారు.. చేయకపోతే ఓడిస్తారని ప్రవచనాలు చెబుతున్న వైసీపీ నేతలకు చీరలు పంచే దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందని నిలదీస్తున్నారు. పేదలకు, పెత్తందారులకు జరుగుతున్నా యుద్ధంలో అంతిమంగా తామే గెలుస్తామని చెప్పిన వైసీపీ నేతలు.. పేదలు ఎవరో.. పెత్తందారులు ఎవరో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అని సెటైర్లు వేస్తున్నారు.

నిజంగా గెలుపుపై అంత ధీమా ఉంటే… చీరలు, కుక్కర్లు, వంటసమాన్లు పంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇక్కడ మరో రకమైన సెటైల్లు కూడా పడుతున్నాయి. జగన్ కు ప్రచారం పిచ్చి పీక్స్ కి చేరిందని అంటున్నారు. సీఎంగా స్కూలు భవనాలపై, పిల్లలకు ఇచ్చే పాలప్యాకెట్లపై, పిల్లలు తినే చిక్కి ప్యాకెట్లపై, చదువుకునే పుస్తకాలు, బ్యాగులపై జగన్ బొమ్మలు ముద్రించారు. చివరికి ప్రజల వ్యక్తిగత ఆస్తి పత్రాలపై కూడా జగన్ బొమ్మలే ముద్రించారు. ఇది చాలదు అన్నట్టు.. ఇప్పుడు ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేయడానికి పంచుతున్న చీరలపై కూడా జగన్ బొమ్మలు అవసరమా? అని సెటైర్లు వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పంచుకోవాల్సిన వాటిని కూడా ఢంకా మోగించి పంచుతున్నారని పంచులు పేలుస్తున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే.. డబ్బు నోట్లపై కూడా జగన్ బొమ్మలు ముద్రించినా ఆశ్చర్యపడటం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -