YS Sharmila: సీమలో అన్నను ముంచేయడమే షర్మిల టార్గెట్.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

YS Sharmila: రాయలసీమ అంటేనే వైయస్ కుటుంబానికి కంచుకోట లాంటిది. ఇక్కడ ఎక్కువ మెజారిటీ సాధిస్తుందన్న నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది అయితే ఈ కంచుకోటను బద్దలు కొట్టడానికి జగన్ చెల్లెలు షర్మిల రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈమె తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా రాజకీయాలలోకి వచ్చి తన అన్నయ్యనే టార్గెట్ చేస్తూ తన అన్న పార్టీని పదవి నుంచి తొలగించడానికి కుట్రలు చేస్తున్నారు.

తన అన్నయ్యతో వ్యక్తిగత విభేదాల కారణంగా రాజకీయాలలోకి వచ్చి రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు షర్మిల. ఈమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా తన అన్నయ్య అవినాష్ రెడ్డి పైనే పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన షర్మిల పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసును అడ్డుపెట్టుకొని షర్మిల పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పాలి. తన బాబాయ్ హత్య కేసులో తన అన్న జగన్ అవినాష్ రెడ్డి హస్తము ఉందని ఈమె బహిరంగంగా చెబుతున్నారు. ఈ విధంగా షర్మిల వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి హస్తముందు అనే విషయాన్ని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అదే విధంగా ఆలోచన చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే కడప జిల్లాలో వైసీపీకి కాస్త ఎదురుగాలి కూడా తగులుతుంది ఇలాంటి తరుణంలోనే వైయస్ఆర్సీపీ పార్టీ కోర్టుకు వెళ్లి మరి షర్మిల ప్రచార కార్యక్రమాలలో భాగంగా వైఎస్ హత్య కేసు గురించి ప్రస్తావనకు తీసుకురాకూడదని అనుమతి తెచ్చుకున్నారు అంటే ఆమె వీరిని ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా రాష్ట్రాన్ని నాశనం చేస్తూ నిరుద్యోగుల జీవితంతో ఆడుకుంటున్నటువంటి తన అన్నయ్యను రాజకీయంగా అనగదొక్కడమే తన టార్గెట్ అంటూ షర్మిల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుండటం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -