Delhi excise policy case: కవితపై త్వరలో ఈడీ రైడ్స్? సన్నిహితుల ఇళ్లల్లో మొదలైన రైడ్స్

Delhi excise policy case: తలెంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితపై త్వరలో ఈడీ రైడ్స్ జరుగుతాయా? త్వరలో ఆమె ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుందా? ముందు సన్నిహితుల ఇళ్లపై దాడులు జరిపి అక్కడ నుంచి వచ్చిన కీలక సమాచారం ప్రకారం తర్వత కవితను టార్గెట్ చేస్తుందా? ఈడీ ముందుగానే కవితకు ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు పంపుతుందా? అంటు అవుననే సమాధానాలు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఢిల్లీలో మందు వేస్తే తెలుగు రాష్ట్రాల్లో కిక్కు ఎక్కుతోంది. అక్కడ జరిగిన స్కాం ఇక్కడ ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి హస్తం ఉందనే ఆరోపణలు దుమారం రేపుతోన్నాయి. జగన్ సతీమణి భారతీ కూడా ఈ స్కాంలో ఉన్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు మరింత ప్రకంపనలు రేపుతోన్నాయి. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిపై ఆరోపణలు రావడంతో ఏపీ రాజకీయాల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు రేపుతోన్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు లేదా అభియోగాలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లల్లో ఏకకాలంలో ఈడీ దాడులు చేపట్టడం కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గురుగావ్, లక్కో, ఢిల్లీలలో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని 30 చోట్ల ఈడీ బృందాలు ఒకేసారి దాడులు చేపట్టింది. లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తెలంగాణకు చెందిన రామచంద్రన్ పిళ్లై ఇంటితో పాటు ఆయన ఆఫీస్, ఆయనకు సంబంధించిన రాబిన్ డిస్టిల్లరీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

అలాగే హైదరాబాద్ లో రామచంద్రన్ పిళ్లైతో సంబంధం ఉన్న గండ్ర ప్రేమ్ సాగర్, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి ఇళ్లల్లోనూ ఈడీ దాడులు చేపడుతోంది. అయితే ఎమ్మెల్యే కవితకు సన్నిహితుడైన అభిషేక్ రావు ఇంట్లో సోదాలు నిర్విహించడంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. దీంతో ఆయన నుంచి సమాచారం సేకరించిన తర్వాత త్వరలో కవిత ఇంటిపై కూడా ఈడీ దాడుుల జరగడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కవిత ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని ఆరు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఈడీ సోదాలు జరుగుతున్నాయి.

ఇక ఏపీలో కూడా విజయసారెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఇంటిపై దాడులు జరిగే అవకాశముందని చెబుతున్నారు. తెలంగాణలో కవిత పేరు బాగా వినిపిస్తుండటంతో ప్రతిపక్షాలు ఆమెపై విరుచుుపడుతున్నాయి. దీంతో ఆమె కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ప విచారించిన కోర్టు.. లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు ఉపయోగించవద్దని ఆదేశాలిచ్చింది. కానీ ఈడీ సోదాలు జరిగితే మళ్లీ కవితపై ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశముంది.

ఢిల్లీకి చెందని బీజేపీ ఎంపీ పర్వేషాన్ కామెంట్స్ తో ఈ స్కాంలో కవిత పేరు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ కూతురు కవిత హస్తం లిక్కర్ స్కాంలో ఉందని బీజేపీ ఎంపీ ఆరోపించారు. ఆమె ప్రత్యేక విమానంలో తెలంగాణకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ఢిల్లీకి తరుచూ వచ్చేదని తెలిపారు. ఓ హోటల్ లో కలుసుకుని లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా ఉండేలా రూపొందించుకున్నారని ఆరోపణలు చేశారు. దీంతో సీబీఐ స్కాంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. తాజాగా దేశంలో పలుచోట్ల ఈడీ దాడులు జరుగుతన్నాయి. కానీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇళ్లల్లో మాత్రం ఎలాంటి సోదాలు ప్రస్తుతం జరగడం లేదు. ఇప్పటికే మనీష్ సిసోడియాకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కవిత సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు జరుగుతుండటంతో.. రానున్న రోజుల్లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనాలు రేపుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. కవితను ఈ స్కాంలో ఇరికించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, కేసీఆర్ ఫ్యామిలీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తుందనే ఆరోపణల క్రమంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనేది అర్ధం కావడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -