KTR-Kavitha: ఆ మాటల వల్ల కష్టాల్లో చిక్కుకున్న కేటీఆర్, కవిత.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

KTR-Kavitha: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతుంటే తెలంగాణ రాజకీయాలు మాత్రం జంపు జిలానీలతో, మాటల తోటలతో రాజకీయం మహారసవత్తరంగా జరుగుతోంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రతి రాజకీయ నాయకుడు ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద బురద జల్లటానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అమిత్ షా చేసిన వాగ్దానానికి కౌంటర్లు ఇవ్వాలనుకుని అడ్డంగా బుక్ అయిపోయారు కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు.

ఇంతకీ ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో భాజపా గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని ఘనంగా ప్రకటించాడు అమిత్ షా.అయితే ఆ ప్రకటన గురించి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవికి కావలసింది గుణంగాని కులం కాదు అని మాట్లాడారు. అయితే ఆ స్టేట్మెంట్ ఇప్పుడు దుమారాన్ని రేపుతుంది. ఇది బీసీలను అవమానించడమే, అందుకు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి అంటూ బండి సంజయ్ రెచ్చిపోతున్నారు.

అదే సమయంలో కల్వకుంట్ల కవిత కూడా బీసీని సీఎం చేస్తాననే మాటలు ఎన్నికల స్టంట్ మాత్రమే అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ని కూడా భాజపా నాయకులు తెగ ట్రోల్ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఎస్సీ ని సీఎం చేస్తానని వారు ప్రదర్శించిన ఎన్నికల స్టంట్ ను తెలంగాణ ప్రజలు మొత్తం చూసారంటూ తిరిగి కవితకు రీకౌంటు ఇచ్చారు భాజపా వర్గం వారు. అయితే ఇందులో కల్వకుంట్ల వారి ఆవేశం కనిపిస్తుంది తప్పితే ఆలోచన ఏమాత్రం లేదు.

ఎందుకంటే ఎన్నికల సీజన్ వరకు పార్టీని మంచి ఫైర్ మీద నడుపుతున్న బీసీ నాయకుడు బండి సంజయ్ ని తప్పించి పార్టీ పగ్గాలని కిషన్ రెడ్డి చేతిలో పెట్టింది అధిష్టానం. అలాంటిది గెలిచిన తర్వాత బీసీని సీఎం చేస్తుందా..ఒకవేళ నిజంగానే గెలిచే అవకాశం ఉంటే ఈ హామీ ఇస్తుందా ఈ చిన్న లాజిక్ ని ఎలా మరిచిపోయారు. అనవసరంగా నోరు జారి ఇరుక్కున్నారు అంటూ కల్వకుంట్ల అన్నా చెల్లెలు ని తెగ ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -