TDP Janasena: టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమేనా.. జరగబోయేది ఇదేనా?

TDP Janasena: ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేయడంతో ఏపీ రాజకీయాలలో సంచలనం రేపింది. ఇక జగన్ సర్కార్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో పవన్ ఎండగట్టిన తీరు కూడా వైసీపీ నేతలకు షాక్ ఇచ్చింది. మరోవైపు, ఎన్డీఏ కూటమిలోకి దారులు మూసుకుపోయాయనుకుంటున్న టీడీపీకి పవన్ రూపంలో ఆశలు చిగురించాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీ ధరన్‌తో పవన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాదెండ్ల మనోహర్ తో కలిసి మురళీ ధరన్ తో పవన్ దాదాపు 15 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. మురళీధరన్‌తో జరిగిన అల్పాహార సమావేశంలో రాబోయే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ చర్చించారని తెలుస్తోంది. దాంతో పాటు, టీడీపీకి కూడా కలుపుకుపోతేనే వైసీపీని గద్దె దించగలమని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్డీఏలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని పవన్ తెలిపారట. మరోవైపు, ఈ రోజు మరి కొంతమంది బీజేపీ నేతలను పవన్ కలిసి ఏపీ రాజకీయాలపై, పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -