Election Commission: ఏపీకి ఈసీ నుంచి ముగ్గురు అధికారులు.. తప్పు చేసే అభ్యర్థుల తాట తీయనున్నారా?

Election Commission: ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవడంతో పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ఎన్నికల బరిలోకి దిగి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలు ఎంతో ప్రత్యేకంగా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికలపై కట్టుదిడ్డమైనటువంటి భద్రత చర్యలను చేపడుతున్నారు. ఎన్నికలు జరిగే వరకు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల కేంద్రాలను కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించడానికి ఏకంగా ముగ్గురు ప్రత్యేక ఆఫీసర్లను ఈసీ ఏర్పాటు చేసింది.

ఈ క్ర‌మంలోనే  సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్ గా రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఈ ముగ్గురు అధికారులు ఒకటవ తేదీ ఏపీలోకి వచ్చి సమస్యాత్మక ప్రాంతాలలో పర్యటించబోతున్నారు. అదేవిధంగా ఎన్నికలలో పాల్గొనబోయే నేతల ప్రచార కార్యక్రమాలను కూడా తెలుసుకోనున్నారు. ఇక ఎవరైతే ఓటర్లను ప్రభావితం చేయడానికి పెద్ద ఎత్తున తాయిలాలను అందించడంపై కూడా నిగా పెట్టనున్నారు.

ఇక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలపై కూడా వీరి నిగా ఉండబోతుంది. ఈ క్రమంలోనే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించడమే కాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా చేపట్టబోతున్నారు. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా ఇటీవల ఈసీ కొన్ని నిబంధనలను అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇంటింటి ప్రచారానికి వెళ్లాలన్నా కూడా ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అలాంటి అనుమతులను తీసుకున్నారా లేదా అన్న విషయాలపై కూడా ఈ ముగ్గురు అధికారులు ఆరా తీయనున్నారు అయితే ఈసీకి విరుద్ధంగా ఏదైనా చేస్తే మాత్రం వారి తాట తీయటంలో కూడా ఈ ముగ్గురు అధికారులు వెనకాడరని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -