TRS Party: గ్యాస్ సిలిండర్ గుర్తుతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ కు ఇది భారీ షాక్ అంటూ?

TRS Party:  ఖమ్మం,నల్గొండ,కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులు కలిసి సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం టిఆర్ఎస్ (తెలంగాణ రాజ్యసమితి) పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 సెగ్మెంట్లలో పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి ఈ పార్టీ దరఖాస్తు చేసుకుంది. విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ పలు షరతులతో ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తుని కేటాయించింది. పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థులందరికీ గ్యాస్ సిలిండర్ గుర్తుని కేటాయించాలని ఆదేశించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం కనీస శాతం సీట్లలో సదరు పార్టీ పోటీ చేయాల్సి ఉంటుంది లేని పక్షంలో ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆగుర్తును ఇతరులకు కేటాయించవచ్చని ఉత్తర్వులలో స్పష్టం చేసింది. 1983 నుంచి కేసీఆర్ తోనే ఉన్నారు బాలరంగం. 1987, 1995లో పొన్నాల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు.

2001లో సిద్దిపేట మండలం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కూడా సేవలందించారు. తెలంగాణ రాజ్యసమితి పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్న బాలరంగం సికింద్రాబాద్లోని ఓల్డ్ ఆల్వాల్ లో ఉన్న తన ఇంటి చిరునామాను పార్టీ ఆఫీసు అడ్రస్ గా పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని తీసుకువచ్చిన అసలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితిగా పార్టీ అధినేత కేసీఆర్ మార్చిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికలలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు.. ఉమ్మడి గుర్తు కేటాయింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జయదేబ్ లాహిరి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న తెలంగాణ రాజ్యసమితి పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్యాస్ సిలిండర్ ని కేటాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -