Voter ID: ఓటు హక్కు లేని వాళ్లకు తీపికబురు.. ఈ పనులు చేస్తే సులువుగా ఓటు నమోదు చేసుకునే ఛాన్స్!

Voter ID: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నజరానా మోగింది. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇక ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండు కూడా ఒకేసారి జరగబోతున్నాయి ఎన్నికలు మే 13వ తేదీ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలన్నింటిని కూడా మొదలుపెట్టారు.

ఇక మన భారతదేశంలో 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును కలిగి ఉంటారు. ఇలా 18 సంవత్సరాల వయసు వచ్చిన వారు ఈ ఎన్నికలలో ఓటు వేయడం కోసం ఇప్పటికే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా ఎన్నికల అధికారులు తెలియజేశారు.

అయితే ఇప్పటికి ఓటు హక్కు లేనటువంటి వారు వచ్చే ఎన్నికలలో ఓటు వినియోగించుకోవడం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.. ప్రతి ఏడాది జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ ఒకటో తేదీకి 18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఈ ప్రక్రియను ఫిబ్రవరిలో ప్రకటించింది. ఇక ఓటు హక్కు లేనివారు దరఖాస్తు చేసుకోవడానికి ఫారం 8 దరఖాస్తును ఆన్లైన్లో కానీ లేదంటే నియోజకవర్గ ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారి లేదా పోలింగ్ కేంద్ర అధికారికి స్వయంగా ఇచ్చి మీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకొని ఓటు హక్కును పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -