Financial Problems: ఆర్థిక ఇబ్బందులా.. ఇలా చేస్తే చాలు లక్ష్మీ మీవెంటే?

Financial Problems: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రధాన సమస్యల్లో ఆర్థిక సమస్యలు ఒకటి. ఆర్థిక సమస్యల కారణంగా గొడవలు చికాకులు సంతోషం లేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో అన్నింటికీ పరిష్కారం డబ్బే అని చెప్పవచ్చు. మరి అటువంటి డబ్బు చేతికి రావాలన్నా చేతిలో ఉండాలి అన్న ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే పూజలు చేయాలి పరిహారాలు పాటించాలి.

ఆర్థిక సమస్యలు ఉండకూడదంటే, సంపాదించిన డబ్బు వృధా కాకుండా ఉండాలంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో తులసి మొక్కని నాటాలి. ప్రతి రోజు సాయంత్రం మొక్క దగ్గర మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. అలాగే ప్రతి నెల మీ సంపాదనలో కొంత భాగాన్ని దానం చెయ్యాలి. ఇలా దానం చేయడం వల్ల లక్ష్మిదేవి అనుగ్రహం పొందుతారు. ఇంట్లో స్త్రీలతో చాలా గౌరవంగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ లక్ష్మి దేవి స్వరూపం స్త్రీని గౌరవిస్తే లక్ష్మిదేవి అనుగ్రహం పొందినట్టే.

 

అలాగే ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించాలీ అంటే ప్రతి బుధవారం ఆవుకు పచ్చి గడ్డి తినిపించాలి. అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో పగిలిన పాత్రలను ఉంచకూడదు. వాటిని ఉపయోగించకూడదు. నెలలో ఏదైనా శుక్రవారం రోజున పెళ్లి కానీ అమ్మాయిలకు తినడానికి పాయసం పెట్టాలి. అంతేకాకుండా కొంత డబ్బుతో పాటు పసుపు బట్టలు దానం చేస్తే లక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున విష్ణు మూర్తి కి శంఖంతో నీటిని సమర్పించాలి. దీంతో లక్ష్మి దేవి చాలా సంతోషిస్తుంది. ప్రతి రోజు స్నానం చేసిన తర్వాత లక్ష్మి దేవిని పూజించి ఆశీస్సులు తీసుకుని నుదిటిన కుంకుమ పెట్టుకోవాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -