Gaddar: గద్దర్ ఇకలేరు.. మూగబోయిన ఉద్యమ గళం.. ఆ పాటలను ఇక వినలేమా?

Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ ఉద్యమకారుడి గళం ఆదివారం మూగబోయిందని చెప్పాలి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో తృదిశ్వాస విడిచారు. ఇలా గద్దర్ ఇకలేరు అనే విషయం తెలియడంతో ఎంతోమంది ఈయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

 

గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురైనటువంటి ఈయన అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే హైదరాబాద్ అపో స్పెక్ట్రా హాస్పిటల్లో చేరిన గద్దర్ కొన్ని రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్నారు అయితే ఈయన హాస్పిటల్ లో ఉన్న సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి తదితరులు ఈయనని పరామర్శించారు.ఈనెల మూడవ తేదీ ఈయనకు వైద్యులు బైపాస్ సర్జరీ కూడా నిర్వహించారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని భావించారు.

ఇలా ఆరోగ్య పరిస్థితి కాస్త కుదటపడుతున్న సమయంలోనే యూరినరీ,ఊపిరితిత్తుల సమస్యలతో గద్దర్ బాధపడుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మరణించడంతో అపోలో హాస్పిటల్ వైద్యులు ఈయన మరణ వార్తను అధికారకంగా ధ్రువీకరించారు. ఇక ఈయన మరణ వార్తను అధికారకంగా తెలియజేసిన అనంతరం పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ భూదేవి నగర్ లో ఆయన సొంత నివాసం వద్దకు తరలించారు.

 

గద్దర్ మరణ వార్తను తెలుసుకున్నటువంటి పలువురు ఉద్యమకారులు అలాగే సినీ సెలెబ్రెటీలు ఆయన పార్థివ దేహాన్ని చూసి నివాళులు అర్పించారు. అదేవిధంగా పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా గద్దర్ తో తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ అతనికి నివాళులు అర్పించారు. ఇక నేడు ఈయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -