Gaddar: ప్రజాశాంతి అభ్యర్థి గద్దర్ కు షాక్.. ఈసీ ఆంక్షలతో కొత్త చిక్కులు

Gaddar: మునుగోడులో ప్రధాన పార్టీలైన అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నడవనుందనే అంచనాలు రాజకీయ విశ్లేషకులు నుంచి వినిపిస్తున్నాయి. అయితే మిగతా పార్టీలు కూడా మునుగోడులో పోటీలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నాయి. తెలంగాణ జనసమితి పార్టీతో పాటు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, వైఎస్సార్ టీపీ, ప్రజాశాంతి పార్టీలు పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే బీఎస్పీతో పాటు ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇక మిగత పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

త్వరలో కోదండరాం, షర్మిల కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. అయితే పోటీలోకి దిగిన ప్రజాశాంతి పార్టీకి షాక్ తగలింది. రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. అయితే ప్రజాశాంతి పార్టీ నామినేషన్ లేయలేదు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రజాయుద్దనౌక గద్దర్ ను కేఏ పాల్ ప్రకటించారు. కానీ గద్దర్ ఇఫ్పటివరకు నామినేషన్ వేయలేదు. దానికి కారణం ప్రజాశాంతి పార్టీని ఇన్ యాక్టివ్ పార్టీ జాబితాలో ఎన్నికల సంఘం పెట్టడమే కారణమని తెలుస్తోంది. ఇటీవల కొన్ని పార్టీలను ఇన్ యాక్టివ్ గా ప్రకటిస్తూ ఈసీ జాబితా విడుదల చేసింది. ఆయా పార్టీలకు నోటీసులు జారీ చేసింది. సరైన ఆధారాలు సమర్పిస్తే యాక్టివ్ పార్టీలుగా గుర్తిస్తామని తెలిపింది.

డాక్యుమెంట్ సమర్పించడానికి అక్టోబర్ 13 వరకు గడువు విధించింది. కానీ ప్రజాశాంతి పార్టీ దానికి కావాల్సిన పత్రాలు అన్నీ సమర్పించారు. కానీ ప్రజాశాంతి పార్టీని యాక్టివ్ పార్టీగా ఇంకా గుర్తించలేదు. రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ లోపు ప్రజాశాంతి పార్టీని యాక్టివ్ గా గుర్తిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజాశాంతి పార్టీకి పోటీ చేయానికి అవకాశం ఉండదు. ఈసీ పరిశీలించి ఒక్క రోజులోనే ప్రజాశాంతి పార్టీని యాక్టివ్ పార్టీగా గుర్తించడం కష్టమే. దీంతో మునుగోడులో పోటీ చేయాలని భావించిన ప్రజాశాంతి పార్టీకి, గద్దర్ కు షాక్ తగిలినట్లు అయింది.

అయితే గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లిన కేఏ పాల్.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తో భేటీ అయ్యారు. ప్రజాశాంతి పార్టీని యాక్టివ్ గా గుర్తించాలని కోరారు. అవసరమైన వివరాలు సమర్పించామని, అయినా గుర్తించలేదన్నారు. ఇన్ యాక్టివ్ పార్టీలు డాక్యుమెంట్స్ సమర్పించడానికి ఈ నెల 13వరకు సమయం ఇచ్చారని, దాని కంటే ముందు మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇస్తారని కేఏ పాల్ ప్రశ్నించారు. ఇది చట్టవిరుద్దమని, తమ పార్టీ నుంచి అన్నీ వివరాలు సేకరించామని, కానీ ఇంకా యాక్టివ్ పార్టీగా గుర్తించలేదన్నారు.

ఇక 2022 జనవరి 1వ తేదీ వరకు ఉన్న ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారని, ఇప్పుడు అక్టోబర్ 4వరకు ఉన్న ఓటర్ జాబితా ప్రకారం నిర్వహిస్తామని చెప్పడంపై న్యాయనిపుణులే అభ్యంతరాలు చెబుతున్నారని కేఏ పాల్ ఆరోపించారు. ఎవరో ఒకరి చేత నామినేషన్ వేయించి తమ పార్టీ సింబల్ ను వారికి కేటాయించేలా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు.

అయితే ప్రజాశాంతి పార్టీని ఇంకా యాక్టివ్ పార్టీగా గుర్తించకపోవడంతో ఉపఎన్నికల బరిలోకి దిగాలని భావించిన గద్దర్ కు షాక్ తగిలింది. దీంతో ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారా లేక ఇండింపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -