Gaddar: గద్దర్ పొలిటికల్ ఎంట్రీ.. త్వరలో ఆ పార్టీలో చేరిక?

తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన పేరు గద్దర్. తెలంగాణ ఉద్యమం సమయంలో తన పాటలతో బాగా పాపులర్ అయ్యారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తన పవర్ ఫుల్ పాటలతో ఉద్యమం గురించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురింగి ప్రజలకు తెలియజేశారు. ఉద్యమం సమయంలో ఎక్కడ సభ జరిగినా గద్దర్ అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. తన పాటలతో ప్రజలను ఉద్యమం వైపు నడిపించారు. ఒకప్పుడు విప్లవోద్యమంలో చురుగ్గా పనిచేసిన గద్దర్.. ఆ తర్వాత విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చారు.

గన్ తో రాజాధికారం సాధ్యమని నమ్మిన ఆయన.. ఆ తర్వాత చివరికి మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎన్నో కేసులు ఎదుర్కొని చాలారోజుల పాటు జైలుజీవితం కూడా అనుభవించారు. ఎన్నికల్లో ఓటు వేయవద్దని, బహిష్కరించాలని పిలుపునిచ్చిన గద్దర్.. ఆ తర్వాత పంథా మార్చుకున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన గద్దర్ నే చివరికి ఓటు హక్కును ఉపయోగించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. రాజకీయ నాయకులను కలుస్తూ రాజకీయ సభలలో పాల్గొంటున్నారు. రాజకీయ ఉద్యమాలలో పాల్గొంటున్నారు. పార్టీలు నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయనను గాంధీభవన్ లో గద్దర్ కలిశారు. అలాగే అమిత్ షా కూడా కలిసి దేశవ్యాప్తంగా తనపై ఉన్న ఉద్యమ కేసులను రద్దు చేసేలా చేయాలని చూశారు. ఇక గత కొద్దిరోజుల క్రితం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను గద్దర్ కలిశారు.

బండి సంజయ్ ను కలవడంతో గద్దర్ బీజేపీలో చేరతారే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపించింది. అయితే తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో గద్దర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు గద్దర్ వినతిపత్రం అందజేశారు. రేవంత్, భట్టిని కలవడంతో పాటు గతంలో రాహుల్ ను కలవడంతో గద్దర్ కాంగ్రెస్ లో చేరుతారని, వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

వామపక్ష భావవాలం కలిగిన గద్దర్ మతతత్వ పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీలో చేరరే అవకాశమం లేదని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరే అవకాశముందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. అంబేడ్కర్ పేరు పార్లమెంట్ భవనాన్ని పెట్టాలని కాంగ్రెస్ నేతలను కలిస్తే ఏం లాభమని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దాని గురించి అయితే ప్రధాని మోదీనే లేదో కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిస్తే లాభం ఉంటుంది. అంతేకానీ కాంగ్రెస్ నేతలకు లిసి ఏం లాభం ఉండదని, రాజకీయల గురించే చర్చించేందుకే గద్దర్ కాంగ్రెస్ నేతలను కలిశారని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -