Akhila Priya: అఖిలప్రియ గెలిస్తే తండ్రి స్థాయిలో పవర్ చూపించడం ఖాయమా.. వెనుకడుగు వేయట్లేదుగా!

Akhila Priya: రాయలసీమలోని కర్నూలు ఆళ్లగడ్డకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ గత కొన్ని దశాబ్దాలుగా గంగుల భూమా ఈ రెండు కుటుంబాలే రాజకీయాలను శాసిస్తున్నాయి. ఇక ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి ఎంతో పలుకుబడి మంచి గుర్తింపు లభించాయి. అయితే ఆళ్లగడ్డ రాజకీయాలను శాసిస్తున్నటువంటి భూమా నాగిరెడ్డి భూమ శోభా నాగిరెడ్డి దంపతులు మరణించడంతో ఆయన వారసులు ఒంటరి పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

శోభ నాగిరెడ్డి 2014 ఎన్నికల ముందు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. మరొక రెండు వారాలలో ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా ఈమె మరణించారు. అయితే ఆ ఎన్నికలలో శోభా నాగిరెడ్డి రెడ్డి గెలిచారు. అనంతరం ఉప ఎన్నికల నిర్వహించి తల్లి స్థానంలో నిలబడినటువంటి అఖిలప్రియ ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక తండ్రి భూమా నాగిరెడ్డి అఖిలప్రియ ఇద్దరు గెలవడంతో కొద్దిరోజుల తర్వాత వీరిద్దరూ వైసీపీ నుంచి టిడిపి పార్టీకి వెళ్లారు.

ఇలా టిడిపి పార్టీలోకి వెళ్లిన తర్వాత కొన్ని రోజులకే భూమ నాగిరెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. దీంతో అఖిల ప్రియకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ గంగుల భూమా అనే రెండు వర్గాలు కూడా ఉంటాయి అయితే 2019 ఎన్నికలలో గంగుల బ్రిజేంద్ర రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి అఖిలప్రియ పై గెలుపొందారు.

ఇలా గత ఎన్నికలలో ఓటమిపాలైనప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా ప్రజల వద్దకు వెళుతూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలలోకి తీసుకు వెళ్తూ అఖిల ప్రియ ముందుకు కొనసాగుతున్నారు. ఇక ఈ ఎన్నికలలో కూడా అఖిల ప్రియకు టికెట్ రావడంతో ఈమె జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా ఈ ఎన్నికలలో కనుక ఈమె గెలిస్తే తన తండ్రి స్థాయిలో పవర్ అందుకోవడం ఖాయమని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -