Garikapati-Anushka: అనుష్క గురించి గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. వీడియో పెట్టిన ఆర్జీవీ!

Garikapati-Anushka: గరికపాటి అలయ్ బలయ్ లో చేసిన కామెంట్లతో ఆయన్ను సినిమా వాళ్లు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన ఆ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి వేదికపైకి వస్తుండగా ఫ్యాన్స్ గుమిగూడి ఫొటోలు దిగుతుండగా.. అప్పటికే ప్రసంగిస్తున్న గరికపాటి నరసింహారావు ఫైర్ అయ్యారు. చిరంజీవి గారూ.. కాస్త మీరు ఫొటో షూట్ ఆపేసి వేదిక మీదకు రావాలంటూ మైకులోనే పెద్దగా చెప్పేశారు. అనంతరం చిరంజీవి అభిమాన సంఘం నాయకులు, పలువురు సినీ ప్రముఖులు గరికపాటిపై విరుచుకుపడ్డారు. మీ ప్రవచనాలపై గౌరవం ఉంది కానీ.. నోటి దురుసు తగదు గురువర్యా… అంటూ సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లోనూ హోరెత్తిస్తున్నారు.

తాజాగా సంచలన్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ.. గరికపాటి, చిరంజీవి ఇష్యూపై స్పందించారు. గరికపాటి నరసింహారావు తీరును తప్పు పట్టిన ఆర్జీవీ.. గతంలో హీరోయిన్ అనుష్కపై గరికపాటి చేసిన కొంటె వ్యాఖ్యలను ట్విట్టర్ లో ఉంచారు. ఆ క్లిప్పింగ్ ను షేర్ చేస్తూ.. మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!.. అంటూ క్యాప్షన్ జోడించాడు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. గరికపాటి మాట్లాడుతూ.. హీరోయిన్లని కుర్రాళ్లు తెగ చూస్తుంటారు.. ఇందులో ఏముంది అని అనుకొనే వాడిని.. కానీ నా చూపు కూడా ఓ చోట ఆగిపోయింది.. అది ఎవరంటే మహానటి అనుష్క.. అలా నిలబడి ఉంది.. మనం కవి కదా.. ఊరికే ఎలా ఉండగలం.. చూశా పై నుంచి కింద దాకా.. అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు గరికపాటి. డిగ్రీ చదువుతున్న తన తనయుడు.. తాను పేపర్ చదువుతుండగా అక్కడే నిలబడి చూస్తున్నాడని, ఎంతకూ కదలకపోయే సరికి తన కాళ్లకు దండం పెడతాడేమో అనుకున్నానని, తీరా చూస్తే, అక్కడ పేపర్ లో అనుష్క బొమ్మను చూస్తున్నాడని గరికపాటి చెప్పారు.

వాడి ధోరిణిలో వాడున్నాడని, నా ధోరణిలో నేనున్నానని చెప్పారు. దాందేముందీ ఎవడికి కావాల్సింది వాడు చూసుకుంటున్నాడంటూ వ్యాఖ్యానించారు. ఏంట్రా అని అడిగితే అక్కడి నుంచి తనయుడు జారుకున్నాడని చెప్పారు గరికపాటి. తర్వాత ఆ ఫొటో చూశాక ఈ అమ్మాయిని చూడటంలో తప్పేమీ లేదనిపించిందంటూ చెప్పుకొచ్చారు గరికపాటి. నన్నే ఆకర్షిస్తోందంటే.. వయసులో ఉన్న మా వాడిని ఆకర్షించదా.. అని కామెంట్ చేశారు గరికపాటి. ఈ వీడియోను ఆర్జీవీ తన ట్విట్టర్ లో ఉంచి సెటైర్లు వేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -