Rayapati Aruna: పవన్ వ్యతిరేక వంద బొచ్చుల్లో ఆర్జీవీ ఒకరు అంతే.. రాయపాటి అరుణ కామెంట్స్ వైరల్!

Rayapati Aruna: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారం అందుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రజలలో తిరుగుతూ వారాహి యాత్ర చేపడుతున్నారు అలాగే పార్టీ నేతలతోనూ నాయకులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక జనసేన పార్టీ నాయకురాలిగా రాయపాటి అరుణ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మీడియా వారు రాంగోపాల్ వర్మ తీస్తున్నటువంటి వ్యూహం సినిమా గురించి కొన్ని ప్రశ్నలు వేశారు జనసేన అధినేత పొత్తులు పెట్టుకుంటారని అలాగే వ్యూహం సినిమాలో ఆయనకు ఎవరు వెన్నుపోటు పొడిచాల్సిన పనిలేదని ఆయనే వెన్నుపోటు పొడుచుకుంటారు అంటూ డైలాగ్స్ ఉన్నాయి ఈ డైలాగ్స్ మీ స్పందన ఏంటి అని రాయపాటి అరుణను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ….

 

రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తారు అంటూ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఆయన రాష్ట్ర ప్రజలను పొడుస్తున్నటువంటి వెన్నుపోట్ల గురించి రాంగోపాల్ వర్మ సినిమా తీస్తే బాగుంటుందని తెలిపారు.అలాగే బాత్రూంలో గొడ్డలి పోటు గురించి వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో కత్తిపోటు గురించి కూడా వర్మ సినిమా చేస్తే బాగుంటుందని ఈమె కామెంట్ చేశారు.

 

ఎప్పుడూ కూడా అసత్యాలను రెండున్నర గంట సినిమాగా చేసే సినిమా చూపిస్తే ఎవరు చూడలేరని ఇలా ఎంటర్టైన్మెంట్ గా కోడి కత్తి ,గొడ్డలిపోటు వంటివి కూడా పెడితే బాగుంటుందని ఈమె విమర్శించారు. మరి రాంగోపాల్ వర్మ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారన్న విషయం గురించి కూడా ఈమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసమే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి రాంగోపాల్ వర్మ కోట్లలో ప్యాకేజ్ వెళ్లడం వల్లే ఆయన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారంటూ తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతోమంది వ్యతిరేకిస్తూ ఉంటారు అంత మందిలో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి కూడా ఒకరు అంటూ రాయపాటి అరుణ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -