RGV: చంద్రబాబు నిన్ను కనాలని అనుకోలేదు.. కానీ నువ్వు పుట్టావు.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

RGV: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అంతేకాకుండా తనపై విమర్శలు గుప్పించే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలోనే లోకేష్ మాట్లాడిన మాటలకు రామ్ గోపాల్ వర్మ దిమ్మ తిరిగే రేంజ్ లో సమాధానం ఇచ్చాడు. లోకేష్ రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ.. ఒక బహిరంగ సభలో అలాగే లోకేష్ మాట్లాడుతూ వాడెవడో ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ అంతా 30 డిగ్రీ సినిమాలు తీస్తాడు.

ఆ మహానుభావుడు సినిమాని తీసే దానికి మాత్రం పర్మిషన్. ప్రజల తరఫున పోరాడుతున్న లోకేష్ కి మాత్రం ఆంక్షలా ఎందుకండీ అని ప్రశ్నించడంతో ఆ వీడియో పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. లోకేష్ నేను థర్డ్ గ్రేడ్ నా లేకుంటే ఫిఫ్త్ గ్రేడా అన్నది ఈ సంగతి కాదు. ఎక్కడో జాబు చేసుకుంటున్నా నేను నా సాయి శక్తుల నా స్వయంకృషితో ఎదిగి డైరెక్టర్ గా మారి హిట్ లు తీశాను ఫ్లాపులు తీశాను సూపర్ హిట్ లు తీశాను. నేనే తీశాను నేనే కొన్నాను. కానీ మీరు చంద్రబాబు నాయుడు ఒక మంచి పొలిటికల్ లీడర్ కొడుకు మీరు. మిమ్మల్ని ఆయన కనాలని అనుకోలేదు. కానీ మీరు పుట్టారు. ఇది ఒక బయోలాజికల్ యాక్సిడెంట్ అంటూ సంచలన వాఖ్యలు చేశారు.

 

మీరు ఏం సాధించారని ఇలా మాట్లాడుతున్నారో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. మీరు ఒక పొలిటికల్ లీడర్ ఏదో పాదయాత్ర చేస్తున్నారు జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. మీరు ఏ పని మొదలుపెట్టారు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అన్న డీటెయిల్స్ నాకు పెద్దగా తెలియదు. కానీ సినిమా షూటింగులు రోజు కొన్ని వందల సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి నా ఒక్కనికే కాకుండా అందరికీ పర్మిషన్ అనేది ఇస్తారు. నేను పనిచేసిన చోట మీరు చేస్తున్నారా లేదు కదా.. షూటింగ్ పర్మిషన్ కి మీ మీటింగ్ పర్మిషన్ కి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అలాగే మీరు తెలిసి మాట్లాడతారా లేకపోతే తెలియక మాట్లాడతారా జనాలకు తెలియదని మాట్లాడుతారా లేదంటే జనాలు ఏవి పట్టించుకోరు అన్న ఉద్దేశంతో మాట్లాడతారా అంటూ చురకలు అంటించారు రామ్ గోపాల్ వర్మ. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో పై స్పందించిన పలువురు నెటిజన్స్ కొందరు రామ్ గోపాల్ వర్మకి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు లోకేష్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -