Nithin: నితిన్ కొత్త మూవీ గ్లింప్స్ మామూలుగా లేదుగా.. హిట్ సాధిస్తాడా?

Nithin: టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నితిన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత ఏడాది ఎక్సట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకులకు పలకరించారు హీరో నితిన్. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో నితిన్ ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమా డిజాస్టర్ గా నిలుస్తూనే ఉంది. భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న నితిన్ సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిమ భీష్మ సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత నటించిన అన్ని సినిమాలు మొత్తం కూడా ఫ్లాప్ అయ్యాయి.

అయినా కూడా నితిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే నితిన్ ప్రస్తుతం మరో కొత్త మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఈ సినిమాను చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ సినిమాను నవీన్ యేర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. దీంతో పాటు టైటిల్‌ కూడా రివీల్‌ చేసేశారు. గ్లింప్స్‌ చూస్తే ఈ చిత్రం రాబరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఈ సినిమాకు రాబిన్‌హుడ్ అనే టైటిల్‌ ఖరారు చేశారు. అంతే కాకుండా నితిన్‌ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తమ్ముడు చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో నితిన్ చెప్పే డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ ఫస్ట్ గ్లింప్స్ ని చూసిన అభిమానులు, ప్రేక్షకులు నితిన్ ఖాతాలో హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -