Macherla Niyojakavargam Review: మాచర్ల నియోజకవర్గం సినిమా రివ్యూ

కెరీర్ ప్రారంభంలో లవర్ బాయ్ ఇమేజ్‌తో నితిన్ దూసుకుపోయాడు. మధ్యలో మాస్ ఇమేజ్ కోసం పరితపించాడు. కానీ అది బెడిసి కొట్టేసింది. ఇక చివరకు ఇష్క్ అంటూ మళ్లీ లవ్ స్టోరీతోనే హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాడు. అలాంటి నితిన్ మళ్లీ మాస్ మంత్రం జపిస్తూ.. మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో వచ్చాడు. ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

Nithiin Macherla Niyojakavargam Movie Review And Raing

కథ…
మాచర్ల నియోజకవర్గానికి చెందిన రాజకీయాలను రాజప్ప(సముద్ర ఖని) శాసిస్తుంటాడు. అక్కడ ఎన్నికలనేవి జరగకుండా దారుణాలకు ఒడిగడుతుంటాడు. అడ్డు వచ్చినవారిని చంపేస్తుంటాడు. అదే సమయంలో సిద్ధు(నితిన్) సివిల్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇక స్వాతి (కృతి శెట్టి) హీరో విలన్‌లకు కామన్ పాయింట్ అవుతుంది. స్వాతిని రాజప్ప ఎందుకు చంపాలనుకుంటాడు? రాజప్పకు సిద్దు ఎలా చెక్ పెడతాడు? చివరకు మాచర్లలో ఎన్నికలు జరిపిస్తాడా? లేదా? అన్నదే కథ.

నటీనటులు…

నితిన్ లవర్ బాయ్‌గా, కూల్‌గా, కాస్త మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లో చేయడంతో నేర్పరి. అలా అని భారీ భారీ డైలాగులు, కొడితే పది మంది ఒకేసారి ఎగిరి పడే స్టంట్లు అంతగా నప్పవు. అలా ఇందులో మాస్ కలెక్టర్‌గా సిద్దు పాత్రలో నితిన్ మెప్పించాడు. ఇక కృతి శెట్టి, కేథరిన్ థ్రెస్సాలు మాత్రం పాటలకు అన్నట్టుగానే ఉన్నారు. వారు కనిపించినంత సేపు అందంగా ఉన్నారు. ఇక విలనిజం పండించడంలోనూ సముద్రఖని కొత్తగా ఏమీ చూపించలేకపోయాడు. ఇది వరకు చూసిన పాత్రల్లానే అనిపించాయి. మిగిలిన పాత్రల్లో వెన్నెల కిషోర్ కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ…

మాస్ సినిమాలకు కాలం చెల్లిందా? అంటే చెప్పలేం. విక్రమ్ మాస్ సినిమానే. కానీ కొత్తగా చూపించారు. అదే రామారావు ఆన్ డ్యూటీ, ది వారియర్ సినిమాలు మరీ రొడ్డ కొట్టుడు. వాటిని జనాలు ఘోరంగా చీత్కరించారు. ఇక ఇప్పుడు ఇదే కోవలోకి మాచర్ల నియోజకవర్గం వచ్చేలా ఉంది. అర్థంపర్థం లేని సీన్లు, లాజిక్‌లకు ఆమడ దూరంలో ఈ మాచర్ల నియోజకవర్గం ఉంది. కలెక్టర్ అనే పదవికి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం కూడా సిద్దు పాత్రలో కనిపించదు.

అసలు కలెక్టర్ అంటే ఇలా ఉంటాడా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ ఒక్క చోట కూడా ఈ సినిమాలో కొత్తదనం కనిపించదు. ఈ కథలో దర్శకుడు ఏం చెప్పి ఒప్పించాడో అతడికే తెలియాలి. పైగా నితిన్ స్వంత బ్యానర్లోనే ఈ చిత్రం వచ్చింది. అటు నిర్మాతగా ఇటు హీరోగా నితిన్‌కు ఈ చిత్రం ఏ రకంగానూ ఉపయోగపడదనిపిస్తోంది. ఒక్క ఐటం సాంగ్ తప్పా ఇందులో ఊరట కలిగించే విషయం గానీ ఊపు తెప్పించే అంశం గానీ కనిపించదు.

పాటలు సోసోగా ఉన్నాయి. పిక్చరైజేషన్ మాత్రం బాగుంది. కెమెరాపనితనం బాగుంది. నితిన్‌ను మరింత స్టైలీష్‌గా చూపించారు. ఎడిటింగ్‌ విభాగానికి చాలా పని మిగిలినట్టు అనిపించింది. మొత్తానికి ఈ చిత్రం మాత్రం మాస్‌ను కూడా మెప్పించేలా కనిపించడం లేదు.

ప్లస్ పాయింట్స్
నితిన్
స్పెషల్ సాంగ్

మైనస్ పాయింట్స్
కథ, కథనాలు
లాజిక్ లేని సన్నివేశాలు

రేటింగ్: 1.5/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -
కెరీర్ ప్రారంభంలో లవర్ బాయ్ ఇమేజ్‌తో నితిన్ దూసుకుపోయాడు. మధ్యలో మాస్ ఇమేజ్ కోసం పరితపించాడు. కానీ అది బెడిసి కొట్టేసింది. ఇక చివరకు ఇష్క్ అంటూ మళ్లీ లవ్ స్టోరీతోనే హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాడు. అలాంటి నితిన్ మళ్లీ మాస్ మంత్రం జపిస్తూ.. మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో వచ్చాడు. ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ...Macherla Niyojakavargam Review: మాచర్ల నియోజకవర్గం సినిమా రివ్యూ