Ileana: పండంటి కొడుకుకు జన్మనిచ్చిన గోవా బ్యూటీ.. కొడుకు పేరు భలే వింతగా ఉందిగా!

Ileana: గోవా బ్యూటీ ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈమె బిడ్డకు జన్మనిచ్చే ఐదు రోజుల తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నటిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం బాగా హంగామా చేసేవారు.

 

సోషల్ మీడియా వేదిక ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే ఇలియానా తల్లిని కాబోతున్నాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించిన ఇలియానా తరచూ తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.

ఇకపోతే ఈమె మగ బిడ్డకు జన్మనిచ్చారని సోషల్ మీడియా వేదికగా తన చిన్నారిఫోటోని షేర్ చేయడమే కాకుండా తన పేరును కూడా తెలియజేశారు. ఇలియానా తన కుమారుడికి కో ఫోనిక్స్ డోలన్ అని పేరును పెట్టినట్లు తెలియజేశారు. ఇక ఈ ప్రపంచంలోకి తమ బిడ్డను ఆహ్వానించినందుకు తమకు చాలా సంతోషంగా ఉందని ఈ సంతోషాన్ని తెలియజేయడానికి మాటలు కూడా రావడం లేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

 

ఇలా ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. అయితే చివరికి తన ప్రియుడిని పరిచయం చేసినప్పటికీ ఆయన ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం ప్రకటించలేదు అంతేకాకుండా తనతో ఇలియానాకు పెళ్లి జరిగిందా లేదా అన్న విషయాలను కూడా ఈమె గోప్యంగా ఉంచారు. అయితే ఇప్పటికైనా ఇలియానా తన బిడ్డ తండ్రికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -