Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి అతనేనా.. అసలేం జరిగిందంటే?

Ileana: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇలియానా ప్రెగ్నెన్సీ కి సంబంధించి అనేక రకాల వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలియానా తరచూ బ్యాక్ బ్యాక్ బేబీ బంప్ తో ఫోటో షూట్లను షేర్ చేస్తూనే ఉంది. అయితే తాను గర్భం దాల్చిన విషయాన్ని చెప్పిన ఇలియానా ఆ గర్భం దాల్చడానికి గల కారణం ఎవరు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే గోవా బ్యూటీ కి పోయే బిడ్డ విషయంలో ఇప్పటికే ఎన్నో రకాల పేర్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఆ వార్తలపై గోవా బ్యూటీ స్పందించడం లేదు. తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించి ఇప్పటికే ఓ స్టిల్ రిలీజ్ చేసింది ఇలియానా. చేతిలో చేయి వేసి ఉన్న స్టిల్ ను మాత్రం పోస్ట్ చేసి సరిపెట్టుకోమంది. ఇప్పుడీ అంశానికి సంబంధించి ఎపిసోడ్-2ను రిలీజ్ చేసింది. తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసింది. ఇందులో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి గడిపిన ఒక మధుర క్షణాన్ని ఆమె బయటపెట్టింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఫొటోలో క్లారిటీ లేదు. బ్లర్ అయిన స్టిల్ ను మాత్రమే విడుదల చేసి, తన బాయ్ ఫ్రెండ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది ఇలియానా.

నన్ను నేను నిర్లక్ష్యం చేసుకున్న టైమ్ లో ఈ మనోహరమైన వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. నాకు సపోర్ట్ గా నిలిచాడు. నేను పడిపోతున్నానని భావించినప్పుడు అతడు నన్ను పట్టుకున్నాడు. నా కన్నీళ్లు తుడిచాడు. నన్ను నవ్వించడానికి జోకులేశాడు. ఏ క్షణంలో నాకు సాంత్వన అవసరమో తెలుసుకొని, ఆ మూమెంట్ లో నన్ను అక్కున చేర్చుకున్నాడు అని రాసుకొచ్చింది. తాజాగా షేర్ చేసిన ఈ పోస్టుతో అభిమానులలో క్యూరియాసిటీ మరింత పెరిగింది. దీంతో ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అన్న విషయం ఇప్పట్లో తెలిసేలా కనిపించడం లేదు. చిన్న చిన్న హింట్లు ఇస్తున్నప్పటికీ వాటి ద్వారా పర్సన్ ఎవరు అన్న విషయాన్ని అభిమానులు ఊహించలేకపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -