God Father: గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ రివ్యూ.. కొత్త సీసాలో పాత సారా అంటూ క్రిటిక్ కామెంట్స్?

God Father: రేపు అనగా అక్టోబర్ ఐదు న ప్రేక్షకులు ముందుకు రాబోయే గాడ్ ఫాదర్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. చిరంజీవి, నయనతార, బాలీవుడ్ కండల ధీరుడు సల్మాన్ ఖాన్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించారు. కాగా ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్ భారీ స్థాయిలో అంచనాలు వేసుకున్నారు.

కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా అంతంత మాత్రమే ఆడుతుందని భావిస్తున్నారు. కాగా రేపు ఈ సినిమా విడుదల సందర్భంగా మొదటి రివ్యూ బయటకు వచ్చేసింది. ప్రముఖ సెన్సార్ సభ్యుడు, సినీ క్రిటిక్ అయిన ఉమైర్ సంధు.. గాడ్ ఫాదర్ సినిమాను ముందుగా చూశాడు. ఇక తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో తెలిపాడు. ఈ రివ్యూ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన గాడ్ ఫాదర్ మొదటి రివ్యూ ఇది. బీ, సీ క్లాస్ ఆడియన్స్ కి ఇది ఒక యావరేజ్ సినిమా.. కొత్త సీసాలో పాతసార అన్నట్లుగా ఉంది. చిరంజీవి మీరు దయచేసి రెస్ట్ తీసుకోండి. మీరు కంటెంట్ ఉన్న సాలిడ్ స్క్రిప్ట్ ఎంచుకోండి. మాస్ హీరో అనే పాత్రల నుంచి బయటికి రండి, చెత్త స్క్రిప్ట్లతో మీ టాలెంట్ నువ్వు వృధా చేసుకోకండి. మీరు మెగాస్టార్ కానీ స్క్రిప్ట్ ల ఎంపికలో మాత్రం అది కనిపించడం లేదు. అని రాసుకొస్తూ రెండుకు ఒకటిగా రేటింగ్ ఇచ్చాడు ఉమర్ సంధు.

ప్రస్తుతం ఉమర్ సంధు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ మాటలు మెగా అభిమానులకు ఆశ్చర్యకరంగా మారాయి. చిరంజీవి మాత్రం ఈ సినిమా విషయం లో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రివ్యూ రాకముందు చిరంజీవి అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరి రేపు అనగా అక్టోబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. మరి ఉమైర్ సంధు చేసిన కామెంట్ విషయంలో మెగాస్టార్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -